‘కట్టల’పాములు పట్టుబడ్డాయిలా.. | Black Money | Sakshi
Sakshi News home page

‘కట్టల’పాములు పట్టుబడ్డాయిలా..

Published Sun, Dec 25 2016 1:39 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

‘కట్టల’పాములు పట్టుబడ్డాయిలా.. - Sakshi

‘కట్టల’పాములు పట్టుబడ్డాయిలా..

ముఖ్యమైనా దాడులు
డిసెంబర్‌ 22, నాగావ్‌ (అసోం): ఐటీ శాఖ దాడుల్లో ఒక వ్యాపారి నుంచి      రూ. 2.35 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం

డి–21, చెన్నై (తమిళనాడు): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్‌రావు ఇంటిపై ఐటీ దాడిలో రూ. 18 లక్షల కొత్త నోట్లు, 2 కిలోల బంగారం స్వాధీనం

డి–17, సూరత్‌ (గుజరాత్‌): కిషోర్‌ భాజియావాలా(టీ కొట్టు య జమాని) వద్ద రూ. 1.08 కోట్ల కొత్త నోట్లతో పాటు రూ. 4.92 కోట్ల బంగారు నగలు, రూ. 1.28 కోట్ల ఆభరణాలు, రూ. 1.28 కోట్ల వెండి, రూ.250 కోట్ల ఆస్తులు స్వాధీనం

డి–16, నెల్లూరు: ఒక హోటల్‌లో రియల్‌ ఎస్టేట్‌ డీల్‌ కుదురుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి.. రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అన్నీ కొత్త రూ.2వేల నోట్లే

డి–16, వాషిమ్‌ (మహారాష్ట్ర): రూ.41 లక్షల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు

డి–15, డెహ్రాడూన్‌(ఉత్తరాఖండ్‌): రూ.7.39 లక్షల కొత్త నోట్లు, రూ.28 వేల పాత నోట్లు స్వాధీనం

డి–15, గువాహటి: రూ.27 లక్షల కొత్త నోట్లు, రూ.2.58 లక్షల పాత నోట్లు స్వాధీనం

డి–15, ధార్వాడ్‌(కర్ణాటక): రూ.23.20 లక్షల కొత్త నోట్లు సహా రూ.26.20 లక్షలు స్వాధీనం

డి–15, ఢిల్లీ: కరోల్‌బాగ్‌ నగల దుకాణంపై దాడి లో కొత్త నోట్లు సహా రూ.30 లక్షలు పట్టుకున్నారు

డి–15, ఠాణే: రూ.16 లక్షల కొత్త నోట్లు సహా రూ.21 లక్షలు పట్టుకున్నారు

డి–15, గువాహటి: రూ.5.58 లక్షల కొత్త నోట్లు స్వాధీనం

డి–15, నోయిడా (ఉత్తరప్రదేశ్‌): యాక్సిస్‌ బ్యాంక్‌ బ్రాంచిలో 20 నకిలీ ఖాతాల్లో రూ.60 కోట్ల డిపాజిట్లు గుర్తింపు

డి–15, జైపూర్‌: రూ.35 లక్షల కొత్త నోట్లు స్వాధీనం

డి–14, పుణే: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర లాకర్లలో రూ.10 కోట్ల డబ్బు దొరికింది

డి–14, బెంగళూరు: రూ. 2.93 కోట్ల కొత్త నోట్లు సహా రూ.3.57 కోట్లు పట్టుకున్నారు

డి–14, చండీగఢ్‌: రూ.17.74 లక్షల కోట్లు సహా 2.18 కోట్లు స్వాధీనం

డి–14, వడోదర (గుజరాత్‌): రూ.13 లక్షల కొత్త నోట్లు సహా రూ.19.67 లక్షలు స్వాధీనం

డి–13, గోవా: రూ. 24 లక్షల కొత్త నోట్లు స్వాధీనం

డి–13, హైదరాబాద్‌: పది మంది దొంగల ముఠా నుంచి రూ.52 లక్షల కొత్త నోట్లు స్వాధీనం

డి–13, బెంగళూరు: బెంగళూరు, హైదరాబాద్‌లలో రూ. 17.36 లక్షల కోట్లు స్వాధీనం. బ్యాంకు, పోస్టాఫీసు అధికారులపై సీబీఐ కేసులు నమోదు

డి–10, బెంగళూరు: బెంగళూరులో బాత్‌రూంలో దాచిన రూ.5.7 కోట్ల కొత్త నోట్లు, 32 కిలోల బంగారం, రూ.90 లక్షల పాత నోట్లు స్వాధీనం

డి–10, ఢిల్లీ: ఒక న్యాయవాద సంస్థపై దాడిలో రూ.2.5 కోట్ల కొత్త నోట్లు సహా రూ.13 కోట్లు స్వాధీనం

డి–9, చెన్నై: టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి స్థావరాలపై దాడుల్లో రూ.9.63 కోట్ల కొత్త నోట్లు సహా రూ.106.52 కోట్ల నగదు, 127 కిలోల బంగారం స్వాధీనం

డి–7, గోవా: రూ.1.5 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం

డిసెంబర్‌ 6, కోల్‌కతా: రూ. 33 లక్షల కొత్త నోట్లు స్వాధీనం, బీజేపీ నేత అరెస్ట్‌

డి–4, సంబల్‌పూర్‌ (ఒడిశా): రూ.85.62 లక్షల కొత్త నోట్లు సహా రూ.1.42 కోట్లు స్వాధీనం

డి–1, బెంగళూరు: రూ.4.7 కోట్ల కొత్త నోట్లు, రూ.30 లక్షల పాత నోట్లు, 7 కిలోల బంగారం స్వాధీనం

నవంబర్‌ 26, ముంబై: విమానాశ్రయంలో రూ.2 కోట్ల బంగారం, రూ.7.5 లక్షల నగదు స్వాధీనం

న–25, ఢిల్లీ: రూ.3.5 కోట్ల కొత్త నోట్లు పట్టివేత, ఇద్దరు యాక్సిస్‌ బ్యాంకు ఉద్యోగుల అరెస్ట్‌

న–13, పట్నా: రైలులో రూ. కోటి స్వాధీనం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement