
చెన్నై రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రధాన రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఓ రైలును బాంబులతో పేల్చేస్తామని ఆగంతకులు ఫోన్ చేయడంతో కలకలం రేగింది. పోలీసులు రంగంలోకి విస్తృత తనిఖీలు చేపట్టారు.
బాంబు నిర్వీర్య బృందం రైల్వే స్టేషన్ లో అణువణువు తనిఖీ చేస్తున్నారు. బాంబు బెదిరింపుతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. బాంబు ఎక్కడ పెట్టారోనని వారంతా భయపడుతున్నారు.