
'రాజకీయ లబ్ధికోసం వెళ్లే వారిని పిలవలేదు'
న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై రేపట్లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం అంశం హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. ఇందులో తమ పాత్ర ఏమీ లేదన్నారు. ముఖ్యమంత్రి నియామకం విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పునరుద్ఘాటించారు.
వార్‌రూంలో జరిగే సమావేశంలో సీమాంధ్రలో పార్టీ బలోపేతంపై చర్చిస్తామని చెప్పారు. రెండు పీసీసీలా, రెండు రీజినల్ కమిటీయా అన్న దానిపై చర్చిస్తామని తెలిపారు. రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ను వదిలి వెళ్లాలనుకునే వారిని ఈ సమావేశానికి అధిష్టానం పిలవలేదని బొత్స అన్నారు.