
పారాచూట్ ఓపెన్ కాకపోవడంతో విషాదం
లండన్: విమానంలో నుంచి స్కై డైవింగ్ చేసిన సమయంలో పారాచూట్ తెరుచుకోకపోవడంతో ఓ మహిళ (49) దుర్మరణం చెందింది. శనివారం ఉత్తర ఇంగ్లండ్లోని కౌంటీ డుర్హంలో ఆ దుర్ఘటన చోటుచేసుకుంది. హెబ్బర్న్కు చెందిన ఈ మహిళను సమీప ఆస్పత్రి తరలించగా, అక్కడ మరణించినట్టు అధికారులు చెప్పారు.
సదరు మహిళ గతంలో విదేశాల్లో పారాచూట్ జంప్స్ చేసిందని, ఇంగ్లండ్లో మాత్రం స్కై డైవ్ చేయడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. స్కై డైవ్ చేయడానికి సొంతంగా పారాచూట్ను సమకూర్చుకుందని చెప్పారు. పారాచూట్ ఓపెన్ కాకపోవడానికి గల కారణాలను బ్రిటీష్ పారాచూటింగ్ అసోసియేషన్ తెలుసుకుంటుందని తెలిపారు. గత నెలలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇలాంటి ఘటనల్లోనే పారాచూట్లు తెరుచుకోకపోవడంతో ఇద్దరు స్కైడైవర్లు చనిపోయారు.