కెయిర్న్ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.324
టార్గెట్ ధర: రూ. 400
ఎందుకంటే: రోజువారీ సగటు ఉత్పత్తి పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇబిటా 10 శాతం వృద్ధితో రూ.3,590 కోట్లకు, నికర లాభం 14 శాతం వృద్ధితో రూ.2,880 కోట్లకు పెరిగాయి. అమ్మకాల పరిమాణం 10 శాతం పెరగడం, రూపాయి 15 శాతం పతనం కావడంతో అమ్మకాల వృద్ధి పెరిగింది. దీంతో ఆదాయం 17 శాతం వృద్ధి సాధించింది. బామర్ హిల్ ప్లాంట్‌లో ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానున్నది. రాజస్థాన్, రవ్వ, కేజీ బేసిన్‌లలో అదనపు నిక్షేపాలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది.
రూపాయి బలహీనంగా ఉండడంతో ఆదాయం మరింతగా పెరగవచ్చని భావిస్తున్నాం. గతేడాది డిసెంబర్ చివరి నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.22,000 కోట్లుగా ఉన్నాయి. ఉత్పత్తి పెంపు, నిక్షేపాల అన్వేషణ విజయవంతం కావడం.. ఈ రెండు అంశాలు షేర్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. సమ్ ఆఫ్ ద పార్ట్స్ ప్రాతిపదికన టార్గెట్ ధరను నిర్ణయించాం.