కత్తులతో భయపెట్టిన పైలట్ | Cathay Pacific pilot arrested with knives at Heathrow Airport | Sakshi
Sakshi News home page

కత్తులతో భయపెట్టిన పైలట్

Published Mon, Apr 20 2015 9:21 PM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

కత్తులతో భయపెట్టిన పైలట్

కత్తులతో భయపెట్టిన పైలట్

లండన్: జర్మన్‌వింగ్స్ విమానాన్ని కో-పైలట్ కూల్చేసిన ఘటన మర్చిపోకుండానే మరో పైలట్ ప్రయాణికులను భయపెట్టాడు. లండన్ నుంచి హాంగ్ కాంగ్ కు 260 మంది ప్రయాణికులను తీసుకెళ్లాల్సిన పైలట్ కత్తులతో పట్టుబడి కలకలం రేపాడు. కత్తులు కలిగివున్న పైలట్ ను లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విమాన సిబ్బందిని తనిఖీ చేస్తుండగా పైలట్ వద్ద కత్తులున్నట్టు గుర్తించారు.

అదుపులోకి తీసుకున్న 61 ఏళ్ల పైలట్ ను తర్వాత స్థానిక పోలీసు స్టేషన్  కు తరలించి ప్రశ్నించారు. అనంతరం బెయిల్ పై అతడిని విడిచిపెట్టారు. ఇదంతా పూర్తయ్యే సరికి చాలా సమయం పట్టడంతో తమ జర్నీ పూర్తి చేయడానికి ప్రయాణికులు ఆదివారం వరకు వేచి చూడాల్సి వచ్చిందని స్కాట్లాండ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement