న్యూఢిల్లీ : సీబీఐ ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం తీర్పుపై స్టే విధించాలంటూ ఆ పిటిషన్లో కోరింది. గౌహతి హైకోర్టు తీర్పుతో సీబీఐ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వల్ల 9వేల ట్రయల్స్, వేయి దర్యాప్తులపై ప్రభావం పడుతుందని తక్షణమే విచారణ జరపాలని కోరింది. పిటిషన్ ను ఈరోజు సాయంత్రం 430 గంటలకు చీఫ్ జస్టిస్ విచారించనున్నారు.
మరోవైపు గౌహతి హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం కోర్టుల్లో ఆసక్తికర వాదనలు జరిగాయి. సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమైనందున 2జీ కేసు విచారణపై స్టే విధించాలని కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజాతోపాటు ఆ కేసులో పలువురు నిందితులు ఢిల్లీ కోర్టును కోరారు