Gauhati High Court
-
అరెస్టులతో జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నారు: గువాహతి హైకోర్టు
గువాహతి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపే క్రమంలో పోక్సో యాక్ట్‌ను ప్రధాన ఆయుధంగా ప్రయోగిస్తూ.. టీనేజ్ భర్తలను కటకటాల వెనక్కి నెడుతోంది అసోం ప్రభుత్వం. ఒకవేళ నేరం గనుక రుజువైతే వాళ్లంతా జీవిత ఖైదు ఎదుర్కోవాల్సి ఉంటుంది!. అయితే.. మైనర్లను లైంగిక నేరాల నుంచి రక్షించే ఉద్దేశంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతోంది. ఈ తరుణంలో.. అసోం ప్రభుత్వ చర్యపై అక్కడి హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అసోంలో అమలు అవుతున్న చట్టం ప్రకారం.. బాల్య వివాహాలకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం 20 ఏళ్లైనా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. అభియోగాలు నమోదు అయిన తొమ్మిది మంది ముందస్తు బెయిల్ కోసం గువాహతి (గౌహతి) హైకోర్టును ఆశ్రయించారు. వాళ్లకు ఊరట ఇస్తూ బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే ఈ బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా బెంచ్ స్పందిస్తూ.. ‘‘బాల్య వివాహం అనేది ముమ్మాటికీ చెడు ఆలోచనే. అలాగని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. అరెస్టుల పర్వంతో ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో అలజడి రేగుతోంది. వాళ్లపై ఆధారపడి పిల్లలు, వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యులు బతుకుతున్నారు . ఈ అంశంపై మా అభిప్రాయాలను తెలియజేస్తాము. కానీ, ప్రస్తుతానికి వాళ్లందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టాలా అనేదే సమస్య!. అని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. పోక్సో చట్టంలో మీరు ఏదైనా జత చేయొచ్చు. కానీ, ఇక్కడ పోక్సో అటే ఏమిటసలు?. న్యాయమూర్తులు అక్కడ ఏముందో చూడలేరు అనుకుంటున్నారా?. పోక్సో యాక్ట్‌ను ఎలా వర్తింపజేస్తారు?. అలాగని మేము ఇక్కడ ఎవరినీ నిర్దోషులుగా ప్రకటించడం లేదు. మిమ్మల్ని(అసోం పోలీసులను ఉద్దేశిస్తూ..) విచారించుకోవడానికి కూడా అడ్డుకోవట్లేదు.ఎవరైనా దోషి అని తేలితే.. ఛార్జ్‌షీట్ ఫైల్ చేయండి. అంతేగానీ కస్టోడియల్ విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముంది? అని జస్టిస్ సుమన్ శ్యామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే అసోం వ్యాప్తంగా.. 3 వేల మందిని బాల్య వివాహాల కట్టడి చట్టం పేరుతో అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. దీంతో వాళ్ల కుటుంబ సభ్యులు రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. కుటుంబాలను పోషించే మగతోడును బంధించడంపై వాళ్ల భార్యలూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాత్రం బాల్య వివాహం అనేది సంఘానికి పట్టిన చెడు అని, దీని నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల మద్దతు అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు. అసోంలో ప్రజారోగ్య జీవనవిధాన గణాంకాలు దారుణంగా ఉన్నాయి. ఈ తరుణంలోనే పరిస్థితికి మూలకారణమైన బాల్య వివాహాలను నిర్మూలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బాల్య వివాహాల నిర్మూలన డ్రైవ్‌ను చేపట్టగా.. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేల మందిపై పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ డ్రైవ్‌ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.పోలీస్ చర్యలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని విరుచుకుపడుతున్నాయి. -
ఆ కారణానికి కూడా విడాకులు ఇచ్చేస్తారా?
‘‘ప్రేమతో ముడిపడిన రెండు మనసులు.. ఒకరినొకరు అర్థం చేసుకున్న ఇద్దరు మనుషులు.. నువ్వూ-నేనూ సమానం అనే భావనతో మెలిగే ప్రేమికులు.. తమ బంధాన్ని శాశ్వతం చేసుకోవడానికి జరుపుకొనే తొలి ‘వేడుక’ పెళ్లి. అది పెద్దలు కుదిర్చిన వివాహమైనా లేదా ప్రేమ పెళ్లైనా కాబోయే దంపతుల మధ్య స్నేహం, దాపరికం లేకుండా ఏ విషయాన్నైనా పంచుకోగల చనువు, ఎదుటి వ్యక్తి ప్రతీ భావనను అర్థం చేసుకోగల మనసు ఉంటే చాలు.’’ అలాంటప్పుడు అంగరంగంగా వైభవంగా జరిగినా లేదా అత్యంత సన్నిహితుల మధ్య చట్టబద్ధంగా రిజిస్టార్ ఆఫీసులో జరిగినా.. ఆ ‘వేడుక’ వధూవరులకు జీవితాంతం మధుర జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. అంతేతప్ప వివాహిత మెడలో వేసుకునే మంగళసూత్రం, నుదుటిన సింధూరం ఉంటే మాత్రమే వారు భర్తతో కలిసి ఉండేందుకు అర్హులని, లేదంటే విడాకులు ఇస్తామంటారా?.. ఇదెక్కడి న్యాయం? అంటున్నారు కొందరు నెటిజన్లు. (భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులు మంజూరు) సంప్రదాయాలను తాము గౌరవిస్తామని.. అయితే అదే సమయంలో ఆత్మాభిమానాన్ని వదులుకునేందుకు ఎంత మాత్రం ఇష్టపడమని కరాఖండిగా చెబుతున్నారు. ఇందులో భాగంగా #WithoutSymbolsOfMarriage అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. తమ పెళ్లి సమయంలో దిగిన, ప్రస్తుత ఫొటోలను షేర్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఓ కారణం ఉంది. హిందూ వివాహ బంధానికి సంబంధించి ఇటీవల గౌహతి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లైన మహిళ సంప్రదాయం ప్రకారం నుదుటిన సింధూరం, చేతులకు గాజులు ధరించేందుకు ఇష్టపడకపోతే సదరు వివాహిత పెళ్లిని తిరస్కరించినట్టేనని పేర్కొంది. ఇతరత్రా కారణాలతో పాటు ఈ రెండింటిని ప్రధాన కారణాలుగా చూపి విడాకులు కోరిన ఓ భర్తకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇక అప్పటి నుంచి కొంత మంది మహిళా నెటిజన్లు ఈ విధంగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘‘గౌరవనీయమైన న్యాయస్థానమా... వైవాహిక బంధం సాఫీగా సాగిపోతుందనడానికి గాజులు, సింధూరం, బిందీ, మంగళసూత్రం మాత్రమే గుర్తులు కావు. ఇవన్నీ ధరించాలా లేదా అన్నది మా ఇష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇంకో విషయం.. ఇవన్నీ లేకుండానే భర్తతో అందమైన జీవితం గడుపుతున్నాం. ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు’’అంటూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. चूड़ी और सिंदूर, बिंदी, मंगलसूत्र ही शादीशुदा होने का पहचान नहीं, हम तो बिना इस सब के ही सूंदर और शादीशुदा हैं माननीय उच्च-न्यायालय महोदय#withoutsymbolsofmarriage pic.twitter.com/7GZ3ZE33on — Dr Bela T. Kaushal (@BelaTurkey) July 1, 2020 बिना मंगलसूत्र, बिना गहने, बिना सिंदूर और पुराने कपड़े में ही शादी! तीस हज़ारी कोर्ट में शादी और उसी दिन की तस्वीर. #मेरी_मर्ज़ी pic.twitter.com/n08e6oFZMS — Dr. Ratan Lal (@ratanlal72) July 2, 2020 -
భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులు మంజూరు
గౌహతి : హిందూ వివాహ బంధానికి సంబంధించి గౌహతి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లైన మహిళ సంప్రదాయం ప్రకారం నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి, చేతులకు గాజలు ధరించడానికి ఇష్టపడకపోతే ఆ మహిళ తన భర్తతో పెళ్లిని తిరస్కరించినట్టేనని వాఖ్యానించింది. ఓ విడాకుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అజయ్ లాంబా, జస్టిస్ సౌమిత్రా సైకియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విధమైన తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి భర్తకు విడాకులు కూడా మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. అసోంలోని ఓ జంటకు 2012 ఫిబ్రవరిలో వివాహం అయింది. అయితే పెళ్లైనా నెల రోజులకే కుటుంబంతో కాకుండా విడిగా ఉందామని భార్య తన భర్తపై ఒత్తిడి తెచ్చారు. తనకు ఉమ్మడి కుంటుబంలో జీవించడం ఇష్టం లేదని తెలిపారు. అయితే అందుకు ఆమె భర్త ఒప్పుకోలేదు. దీంతో 2013లో ఆమె భర్త ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయారు. అయితే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై ఆమె గృహ హింస కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన గౌహతి హైకోర్టు భార్య దాఖలు చేసిన పిటిషన్లో నిజం లేదని తేల్చింది. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన భర్త.. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య విహహ సంప్రదాయాన్ని పాటించడం లేదని.. బొట్టు పెట్టుకోవడం లేదని, గాజులు ధరించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భార్య విడిగా ఉండటం వల్ల సంతానం కూడా కలగలేదని చెప్పాడు. అయితే ఫ్యామిలీ కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అతడు గౌహతి హైకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్‌పై విచారణ చేపట్టిన గౌహతి హైకోర్టు ఈ నెల 19న తీర్పు వెలువరించింది. పెళ్లైన హిందూ మహిళలు సంప్రదాయం ప్రకారం నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి, చేతికి గాజులు వేసుకోవడం ఇష్టపడకపోతే ఆ పెళ్లిని నిరాకరించినట్టే అవుతుందని తెలిపింది. అలాగే ఆ భర్తకు విడాకులు కూడా మంజూరు చేసింది. మరోవైపు ఇటువంటి పరిస్థితుల్లో కూడా భర్తను భార్యతో కలిసి ఉండమని చెప్పడం అతడిని హింసించడమే అవుతుందని వాఖ్యానించింది. -
10 మంది జడ్జీలకు కేంద్రం క్లియరెన్స్
న్యూఢిల్లీ: ‘హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు చేపట్టకుండా న్యాయవ్యవస్థను స్తంభింపజేస్తారా’ అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీ, గువాహటి హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియామకం కోసం పది మంది పేర్లకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. వీరిలో ఢిల్లీ హైకోర్టుకు 5 మందిని, గువాహటి హైకోర్టుకు 5 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తారు. ఢిల్లీ హైకోర్టుకు ప్రతిపాదించిన 5 మందిని జ్యుడీషియల్ సర్వీసెస్ నుంచి తీసుకుంటుండగా, గౌహతి హైకోర్టుకు ప్రతిపాదించిన 5 మందిని బార్ కౌన్సిల్ నుంచి, రాష్ట్ర న్యాయ సేవల నుంచి తీసుకుంటున్నారు. తుది ఆమోదం కోసం ప్రతిపాదనలను కేంద్రం రాష్ట్రపతి భవన్‌కు పంపించింది. ఈ వారాంతం కల్లా అనుమతి ఆమోదం లభించే అవకాశం ఉంది. -
గౌహతి హైకోర్టు తీర్పుపై సీబీఐ వాదనలు వినడానికి సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ: సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం అని గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై నాలుగు వారాల్లో స్పందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం గౌహతి హైకోర్టులో పిటిషన్ వేసిన నవేంద్రకుమార్కు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 6న గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ తరఫున ఉద్యోగబృంద, శిక్షణ సంస్థ (డీవోపీటీ) దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఆ నోటీసుకు జత చేసింది. కాగా, సంచలనాత్మక కేసుల్లో సీబీఐ చేస్తున్న నేర విచారణకు ఆటంకం కలిగేలా గౌహతి హైకోర్టు తీర్పు ఉన్నదనే ఉద్దేశంతో నవంబర్ 9న ఆ తీర్పుపై సుప్రీం స్టే విధించిన విషయం తెలిసిందే. -
బూచిలా మిగిలిన ‘బ్యూరో’
1963లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీచేసిన తీర్మా నం (రిజల్యూషన్) చెల్లదంటూ గౌహతి హైకోర్టు సంచలనాత్మక మైన తీర్పు ఇచ్చింది. సీబీఐ అనేది ఒక శాఖ కాదనీ, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెం ట్‌కు చెందిన ఒక విభాగం కూడా కాదనీ గౌహతి కోర్టు తీర్పులో పేర్కొన్నది. అందువల్ల అది ‘పోలీస్ బలగం’ నిర్వచనం కిందకి రాదని కూడా స్పష్టపరిచింది. అంతేకా కుండా సీబీఐని ఏర్పాటు చేసిన 1963లోని తీర్మానం చెల్లదంటూ కొట్టిపారేసింది. దీని ఫలితమేమంటే అసలు సీబీఐ అనేది లేనట్టే అనీ, అది ఇంత వరకూ చేస్తూ వచ్చిన పరిశోధనలు, దాఖలు చేసిన ఛార్జిషీట్లు, నడిపించిన విచారణలు, వేయించిన శిక్షలు ఏవీ చెల్లవనీ తేలుతుంది. కంగుతిన్న సీబీఐ ఈ తీర్పుతో ఒక్కసారి సీబీఐ అదిరిపోయింది. హుటాహు టిన సుప్రీంకోర్టుకు పరుగెత్తి అప్పీలు చేసింది. శనివారం కోర్టు పనిచేయదు. అయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి, మరొక న్యాయమూర్తితో కలిసి ఒక బెంచ్గా ఏర్పడి గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును ‘స్టే’ చేశారు. ఈ తీర్పు ఎంత తీవ్రమైనదో దీనితో అర్థమవుతున్నది. ఈ తీర్పును సుప్రీంకోర్టు ఆమోదిస్తే మాత్రం దేశంలో చాలా తీవ్రపరిణామాలు వస్తాయి. అయినా సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలనే పరిగణనలోనికి తీసుకుంటుంది గాని, పరిణా మాలు పట్టించుకోదు. ఎంతో పెద్ద పెద్ద రాజకీయ నాయ కులను, మంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను, అధి కారులను, పార్లమెంటు సభ్యులను జైలుకు సీబీఐ కోర్టు జైలుకు పంపింది. ఇంకా చాలామంది ముఖ్యులను జైలు కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నది. అలాంటిది, అసలు సీబీఐ వ్యవ స్థే చెల్లదని తీర్పువస్తే? రాజకీయం అల్లకల్లోలం కాక ఏమవుతుంది! ఎలా చట్ట విరుద్ధం? సీబీఐ పుట్టుక చట్ట విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఏ ప్రాతిపదికన తీర్పు ఇచ్చిందో ఒకసారి చూద్దాం. సీబీఐని ఏర్పాటు చేసిన రిజల్యూషన్, దాని ఏర్పాటుకు సంబంధిం చిన అసలు రికార్డు లభ్యం కాలేదు. ఈ రిజల్యూషన్‌ను రాష్ట్రపతికి పంపనే లేదని, ఆయన తన అనుమతి మం జూరు చేయలేదని కూడా హైకోర్టు చెప్పింది. అంతేకాదు, ఈ తీర్మానం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని కూడా అనలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సీబీఐ అనేది కొత్త విభాగమని అది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ వం టిది కాదని కూడా చెప్పింది. అంటే సీబీఐ పుట్టుక ప్రశ్నార్థ కమే అయింది. పరిపాలనకు సంబంధించిన చట్టాలను రాష్ట్ర శాసనసభలు కాని, పార్లమెంటు కాని చేయడం పరిపాటి. వాటిని రాష్ట్రపతి ఆమోదిస్తారు. రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లే ముందు శాసనసభల్లో, ఆయా సందర్భాన్ని బట్టి లోక్ సభలో బిల్లుపై చర్చ జరుపుతారు. సభ ఆమోదించి, అవసరమైన సవరణలు చేసి రాష్ట్రపతికి పంపుతుంది. దానిపై ఆయన ఆమోదముద్ర వేస్తారు. అప్పుడది చట్టం అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తికాకపోతే అది చట్టం కానే రదు, అమలులోకే రాదు. సీబీఐ ఎలా ఏర్పడింది? 1946లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ని ఏర్పరి చారు. దీనికి ముందు 1943లో భారత ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (యుద్ధ శాఖ)ను ఏర్పరచింది. కేంద్ర ప్రభుత్వంలో పెరుగుతున్న లంచగొండి తనం అవి నీతికి సంబంధించిన ఫిర్యాదులను దర్యాప్తు చేయటమే దీని ఉద్దేశం. ఆ తరువాత ఇది 1946లో డీఎస్పీఈ చట్టంగా రూపొందింది. ఈ చట్టం ఉద్దేశమేమంటే ఒక ప్రత్యేక పోలీసు బలగాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయటం. అక్కడ జరిగే నేరాలను దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు చేపట్టడం. ఆ తర్వాత దీని పరిధిని ఇతర ప్రాంతాలకు విస్తరింపచేయటం. ఏదైనా రాష్ట్రాలలో దర్యాప్తు చేయాల నుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అను మతిలేకుండా దర్యాప్తు చేయటానికి వీల్లేదు. పరిస్థితి ఇలా ఉంటే సీబీఐ తన అధికారాలను, పరి ధిని విస్తరించుకుంటూ పోతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా విచారణకు సంబంధించి సీబీఐకి విస్తృతమైన అధి కారాలను కట్టబెడుతూ పోతున్నది. విచారణకు సంబం ధించి అది చాలా ప్రధానమైన సంస్థగా ఎదిగింది. ప్రభు త్వోద్యోగులపై విచారణ జరిపించటానికి ఒక మాన్యు వల్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. 1963లో ఉదహరించిన విషయాలకంటే ఇంకా ఎక్కువ అంశాలను తన పరిధిలోకి తెచ్చుకున్నది. స్కాంల మీద స్కాంలు పెరి గిపోతుంటే అన్నింటినీ విచారణ చేయటానికి సిద్ధపడింది. ఈ దశలలో జరిగిన వ్యవహారాలు దేనికీ చట్టబద్ధత లేదు. విమర్శల జడి కేంద్రం ఏది తలచుకుంటే అది సీబీఐ చేస్తున్నది. అందు కనే దానిని కేంద్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు దుర్వినియో గపరుస్తున్నదనే ఫిర్యాదులు చాలా వస్తున్నాయి. తనకు ఇష్టమైన వాళ్ల మీదికి వెళ్లకుండా, ఇష్టం లేని వారిపై చర్య లకు ఉపక్రమిస్తున్నదనే అభియోగాలు కూడా సీబీఐ మీద ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల 2-జీ స్కాం దగ్గర నుం చి, బొగ్గు కుంభకోణం నుంచి ఇటువంటి ఫిర్యాదులు, విమర్శలు మరీ వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కొంత మందికి సీబీఐ ‘క్లీన్ చిట్’లు ఇస్తున్న సంగతిని, వీటి మీద రేగుతున్న దుమారాన్ని కూడా గమనించడం అవసరం. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయంటే సీబీఐకి ఒక శాసనపరమైన ప్రాతిపదిక లేకపోవడం. ఎన్నోసార్లు నేరవిచారణకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం తీసు కురావాలని ఆందోళన చేస్తున్నారు. చట్టం తీసుకువచ్చి సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిగల ఒక సంస్థగా చేయాలనీ అడు గుతున్నారు. వాస్తవానికి అనేకసార్లు దీనికి సంబంధించి ఒక బిల్లును కూడా సీబీఐ తయారు చేసి కేంద్రానికి పం పటం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పు కోవటం లేదు. సుప్రీం జోక్యం ఈ లొసుగులు ఉండటం వల్లనే చాలాసార్లు సుప్రీంకోర్టు దర్యాప్తులను తనే స్వయంగా పర్యవేక్షించటానికి దిగింది. దర్యాప్తులు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు తనకు తెలియజేస్తూ ఉండాలని నియంత్రించింది. ఇది సుప్రీంకోర్టు చేయవలసిన పనికాదు. కానీ చేస్తున్నది. ఎవరి స్వేచ్ఛనుగాని, ప్రాణాన్ని గాని చట్టంలో రూపొం దించిన పద్ధతి ప్రకారం వేరే విధంగా హరించకూడదని రాజ్యాంగం చాలా స్పష్టంగా చెబుతున్నది. ఎందుకంటే స్వేచ్ఛకు, ప్రాణానికి రాజ్యాంగం ఎంతో విలువ ఇచ్చింది. శాసన బద్ధమైన పాలన అంటే చట్ట ప్రకారంగా పరిపాలన జరగాలని అర్థం. చట్టం అంటే అది పార్లమెంటుగాని రాష్ట్ర శాసనసభలు గాని తయారు చేసినవి అయి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మీద చట్టాలు నడిచి పోకూడదు. అలా జరిగితే అది రాజ్యాంగ సూత్రాల ఉల్లం ఘనే అవుతుంది. అంతిమ నిర్ణయం ఏది? అందుకనే గౌహతి హైకోర్టు సీబీఐకి చట్టబద్ధతలేదని, అదే విధంగా ఢిల్లా స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946కి కూడా రాజ్యాంగ బద్ధతలేదని చెప్పింది. సుప్రీం కోర్టు ఈ తీర్పుపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్ప టికైనా మించిపోయింది లేదు. ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకువచ్చి నేర దర్యాప్తులపై ఒక స్పష్టమైన పద్ధతి ప్రవేశ పెట్టి, దర్యాప్తులు జరిపించి దోషులను న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఈ ప్రక్రియ ప్రజల జీవితాలకు, స్వేచ్ఛకు సంబంధించినది. ఈ రెండింటినీ కాపాడవలసిన బాధ్యత ప్రజలందరిదీ! వీటిని పోలీసుల చేతుల్లో పెట్టకూడదు! - బొజ్జా తారకం, సీనియర్ న్యాయవాది -
కార్టూన్
హమ్మయ్య! రాజ్యాంగబద్ధత లేదనేసరికి హడలి పోయాన్సార్! -
హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పుపై సుప్రీంకోర్టు శనివారం స్టే విధించింది. ఈ తీర్పును సాకుగా చూపి.. పలు సంచలనాత్మక కేసుల్లో నిందితులు తమపై సీబీఐ దర్యాప్తు ఆపేయాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలో తీర్పు అమలును తాత్కాలికంగా నిలిపేస్తున్నామని ప్రకటించింది. దీంతో సీబీఐ, కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నాయి. 1963లో నాటి కేంద్ర హోం శాఖ తీర్మానంతో సీబీఐ ఏర్పాటైందని, కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వులతో ఏర్పడిన సీబీఐని పోలీసు దళంగా పరిగణించలేమని పేర్కొంటూ ఇటీవల గౌహతి హైకోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నాటి కేంద్ర హోం శాఖ తీర్మానాన్ని కూడా ఈ సందర్భంగా కోర్టు కొట్టివేసింది. దీంతో సీబీఐ ఉనికే ప్రశ్నార్థకమైంది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద దుమారం లేపింది. గౌహతి హైకోర్టు తీర్పుతో పలు కీలక కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఆటంకాలు ఏర్పడుతున్నాయంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ) శనివారం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. దీన్ని తక్షణమే విచారించాలని కోరింది. దీన్ని ప్రత్యేక సందర్భంగా పరిగణించిన చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను శనివారం ఆయన నివాసంలో విచారించింది. నవేంద్ర కుమార్ వాదన తోసిపుచ్చిన కోర్టు..: గౌహతి హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ మీద సంచలన తీర్పునకు కారణమైన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి నవేంద్ర కుమార్ తరఫు న్యాయవాది కూడా ఈ విచారణకు హాజరయ్యారు. హైకోర్టులో తాము వేసిన కేసులో సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ) ప్రతివాది కాదని, కాబట్టి ఆ శాఖ వేసిన అప్పీలును కొట్టివేయాలని కోరారు. ఈ కేసులో స్పందించాల్సింది సీబీఐ లేదా హోం శాఖ మాత్రమేనన్నారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మీకు ఏమైనా అభ్యంతరాలుంటే.. రెండు వారాల్లోగా దాఖలుచేసే మీ స్పందనలో ఆ విషయాలు ప్రస్తావించండి. అప్పుడు వాటికి కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్తుంది. వాటిని మేం పరిశీలిస్తాం’’ అని పేర్కొంది. సీబీఐ.. డీవోపీటీ పరిధిలోకి వస్తుందని, కాబట్టి అది తగిన శాఖేనని తెలిపింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్(ఏజీ) జీఈ వాహనవతి మాట్లాడుతూ.. సీబీఐ, హోం శాఖ ప్రత్యేకంగా తమ అప్పీళ్లను దాఖలు చేస్తాయన్నారు. స్టే విధించక తప్పదు..: ‘‘మీరు అసలు హైకోర్టులో తగిన ప్రతివాదులను ఇంప్లీడ్ చేయలేదు’’ అని నవేంద్ర కుమార్ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘మేం ఈ రోజు పేపర్లో చదివాం. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పలు కీలక కేసుల్లో నిందితులు తమ మీద సీబీఐ దర్యాప్తు నిలిపేయాలని కోరుతున్నారు. మీరూ చదివే ఉంటారు. మేం హైకోర్టు తీర్పుపై స్టే విధించక తప్పదు. మీ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించండి. మేం ప్రతిదాన్నీ పరిగణనలోకి తీసుకుంటాం. స్టే ఇచ్చినంత మాత్రాన.. మేం మీ అభ్యర్థనను తోసిపుచ్చినట్లు కాదు’’ అని పేర్కొంది. పది నిమిషాల వాదనల అనంతరం.. గౌహతి హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి వాదనలను డిసెంబర్ 6కు వాయిదా వేసింది. హైకోర్టుది తప్పుడు నిర్ణయం: ఏజీ వాదనల సందర్భంగా ఏజీ వాహనవతి మాట్లాడుతూ.. తప్పుడు ప్రశ్నలు, తప్పుడు ఊహల ఆధారంగా గౌహతి హైకోర్టు తీర్పు వెల్లడించిందని అన్నారు. ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ(డీఎస్పీఈ) చట్టం.. సీబీఐకు వర్తించదని పేర్కొనడంలో అర్థం లేదన్నారు. ఈ సందర్భంలో ధర్మాసనం స్పందిస్తూ.. హోం శాఖ తీర్మానం చేశాక తదుపరి చర్యలేవీ ప్రభుత్వం తీసుకోలేదు కదా అని గుర్తుచేసింది. దీనిపై వాహనవతి మాట్లాడుతూ.. హైకోర్టు చెప్పిన కారణాలేవీ సమంజసంగా లేవన్నారు. పరిపాలనా న్యాయ సూత్రాన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు. ఈ కేసులో ప్రాతినిధ్య చట్టం(డెలిగేటెడ్ లెజిస్లేషన్) అంశం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ప్రాతినిధ్య చట్టానికి(చట్టం ప్రకారం తమకు సంక్రమించిన అధికారాల మేరకు ఒక సంస్థ లేదా వ్యక్తి చేసే ఉప చట్టం), కార్యనిర్వాహక అధికారాలు దఖలు పరచడానికి తేడా ఉందన్నారు. వీటిని తాము పరిశీలించి.. పరిగణనలోకి తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. వాహనవతి మాట్లాడుతూ.. మొత్తం 9 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సీబీఐలో మొత్తం 6 వేల మంది దాకా ఉన్నారని చెప్పారు. -
సుప్రీం కోర్టులో సీబీఐకి ఊరట, గౌహతి హైకోర్టు తీర్పుపై స్టే
కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సీబీఐ ఏర్పాటు రాజ్యంగబద్ధం కాదంటూ గౌహతి హైకోర్టు వెలువరించిన సంచలన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. గౌహతి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. న్యాయస్థానం తీర్పుపై స్టే విధించాలంటూ ఆ పిటిషన్లో కోరింది. గౌహతి హైకోర్టు తీర్పుతో సీబీఐ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వల్ల 9వేల ట్రయల్స్, వేయి దర్యాప్తులపై ప్రభావం పడుతుందని తక్షణమే విచారణ జరపాలని కోరింది. -
గౌహతి హైకోర్టు తీర్పుపై సుప్రీంలో కేంద్రం పిటిషన్
న్యూఢిల్లీ : సీబీఐ ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం తీర్పుపై స్టే విధించాలంటూ ఆ పిటిషన్లో కోరింది. గౌహతి హైకోర్టు తీర్పుతో సీబీఐ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వల్ల 9వేల ట్రయల్స్, వేయి దర్యాప్తులపై ప్రభావం పడుతుందని తక్షణమే విచారణ జరపాలని కోరింది. పిటిషన్ ను ఈరోజు సాయంత్రం 430 గంటలకు చీఫ్ జస్టిస్ విచారించనున్నారు. మరోవైపు గౌహతి హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం కోర్టుల్లో ఆసక్తికర వాదనలు జరిగాయి. సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమైనందున 2జీ కేసు విచారణపై స్టే విధించాలని కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజాతోపాటు ఆ కేసులో పలువురు నిందితులు ఢిల్లీ కోర్టును కోరారు -
గౌహతి హైకోర్టు తీర్పుపై నిపుణులు ఏమంటున్నారు?
గౌహతి హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులు ఆసక్తిర వ్యాఖ్యలు చేస్తున్నారు. తీర్పు ప్రభావం చాలా విసృ్తతంగా ఉంటుందని, సీబీఐ ఏర్పాటు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ఆ సంస్థ నమోదు చేసిన కేసులన్నీ చెల్లకుండా పోతాయని చెబుతున్నారు. దేశాన్ని కుదిపేసిన కేసులను ఎన్నింటినో సీబీఐ దర్యాప్తు చేసిందని, వీటిల్లో దోషులకు శిక్షలు కూడా పడ్డాయని, తాజా తీర్పుతో వాటన్నింటిపైనా ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు. జైల్లో ఉన్నవారంతా బయటకు రావడానికి మార్గం ఏర్పడుతుందని అంటున్నారు. ఈ కేసులన్నీ నిలబడాలంటే గౌహతి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడం లేదా మొత్తంగా కొట్టివేయడంగానీ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. తీర్పును కొందరు న్యాయ నిపుణులు స్వాగతిస్తుండడగా.. మరికొందరు తీవ్రంగా తప్పు పడుతున్నారు. మాజీ డెరైక్టర్లు ఏమన్నారు..? తీర్పు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనిపై కేంద్రం, సీబీఐ తక్షణమే దృష్టి సారించి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే సుప్రీంకోర్టు సూచనల మేరకు వాటన్నింటిని సరిచేయాలి. -విజయ్ శంకర్, సీబీఐ మాజీ డెరైక్టర్ ఈ తీర్పు ప్రభావం ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులపై ఏమాత్రం ఉండబోదు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం కింద సీబీఐ కేసులను దర్యాప్తు చేస్తోంది. డీఎస్‌పీఈకి చట్టబద్ధత ఉన్నందున సీబీఐ కేసుల్లో దర్యాప్తులు యథాతథంగా కొనసాగుతాయి. - సీబీఐ మాజీ డెరైక్టర్ పీసీ శర్మ నేను ఆనాడే చెప్పా నా అభిప్రాయం ప్రకారం సీబీఐ చట్టబద్ధ సంస్థ కాదు. బ్రిటిష్ కాలంలో ఓ చట్టం ద్వారా ఇది ఏర్పాటైంది. సీబీఐకి చట్టబద్ధత కల్పించాల్సిందిగా 2010లో పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రతిపాదించా. ఆమోదం దాకా రాలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. తాజా తీర్పు నేపథ్యంలో అందరినీ సంప్రదించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. - మనీష్ తివారి, కేంద్ర సమాచార శాఖ మంత్రి -
సీబీఐ ఉనికి ప్రశ్నార్థకం?
గౌహతి హైకోర్టు తీర్పుతో ప్రకంపనలు కేంద్ర ప్రభుత్వం, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ తీర్పుపై నేడే సుప్రీంలో పిటిషన్ వేస్తామని కేంద్రం వెల్లడి ప్రధాని మన్మోహన్‌తో సమావేశమైన మంత్రి నారాయణస్వామి 2జీ కేసులో సీబీఐ విచారణ ఆపేయాలన్న న్యాయవాదులు సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు సీబీఐని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. 2జీ కుంభకోణం వంటి కీలక కేసులపైనా ఈ తీర్పు ప్రభావం పడింది. సీబీఐ సంస్థే రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు ఇక ఆ విభాగం చేస్తున్న దర్యాప్తునకు విలువ లేదంటూ కోర్టుల్లో న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ తీర్పుతో సీబీఐ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది. తీర్పుపై స్టే విధించాలంటూ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ పెద్దల్లో చర్చలే చర్చలు.. సీబీఐ తన మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉండడంతో సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి వి.నారాయణస్వామి శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి కోర్టు తీర్పుపై చర్చించారు. తర్వాత పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాతోపాటు న్యాయశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ కూడా మంత్రి నారాయణస్వామితో సమావేశమై తీర్పు విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. సుప్రీంలో దాఖలు చేయబోయే పిటిషన్‌కు రూపకల్పన చేసిన అనంతరం రంజిత్ సిన్హా.. అటార్నీ జనరల్ జీఈ వాహనవతితో భేటీ అయ్యారు. కేంద్రం శనివారమే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తుందని, సోమవారం విచారణకు వస్తుందని సిన్హా విలేకరులకు వెల్లడించారు. గౌహతి హైకోర్టు తీర్పుపై ప్రశ్నించగా.. ‘‘మేం మా పనిని ఎప్పట్లాగే చేస్తున్నాం. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులపై ఆ తీర్పు ప్రభావం ఉండదు’’ అని ఆయన తెలిపారు. సీబీఐ కేసులు చెల్లవంటూ రాజా, సజ్జన్ కేసుల్లో న్యాయవాదుల వాదనలు.. గౌహతి హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం కోర్టుల్లో ఆసక్తికర వాదనలు జరిగాయి. సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమైనందున 2జీ కేసు విచారణపై స్టే విధించాలని కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజాతోపాటు ఆ కేసులో పలువురు నిందితులు ఢిల్లీ కోర్టును కోరారు. కేసు విచారణను కొనసాగించినట్లయితే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వారి తరఫు న్యాయవాదులు జడ్జికి విన్నవించారు. అయితే వారి వాదనలను సీబీఐ ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ తోసిపుచ్చారు. వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా నిర్ణయం తీసుకోలేనని చెప్పారు. దీంతో నిందితుల తరఫు న్యాయవాదులు అప్పటికప్పుడు కోర్టు తీర్పును జడ్జికి చూపించారు. ఈ కేసులో విచారణను నిలిపివేయాల్సిందిగా కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. 1984 నాటి సిక్కుల అల్లర్ల కేసులో నిందితుడు, కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ కూడా ఇదే వాదనను వినిపించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చట్ట వ్యతిరేకమని ప్రకటించాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. తనపై దాఖలు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టివేయాలని ఆయన కోరారు.