న్యూఢిల్లీ: సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం అని గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై నాలుగు వారాల్లో స్పందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం గౌహతి హైకోర్టులో పిటిషన్ వేసిన నవేంద్రకుమార్‌కు నోటీసులు జారీ చేసింది.
నవంబర్ 6న గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ తరఫున ఉద్యోగబృంద, శిక్షణ సంస్థ (డీవోపీటీ) దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఆ నోటీసుకు జత చేసింది. కాగా, సంచలనాత్మక కేసుల్లో సీబీఐ చేస్తున్న నేర విచారణకు ఆటంకం కలిగేలా గౌహతి హైకోర్టు తీర్పు ఉన్నదనే ఉద్దేశంతో నవంబర్ 9న ఆ తీర్పుపై సుప్రీం స్టే విధించిన విషయం తెలిసిందే.