సుప్రీం కోర్టులో సీబీఐకి ఊరట, గౌహతి హైకోర్టు తీర్పుపై స్టే
కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సీబీఐ ఏర్పాటు రాజ్యంగబద్ధం కాదంటూ గౌహతి హైకోర్టు వెలువరించిన సంచలన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. గౌహతి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది.
న్యాయస్థానం తీర్పుపై స్టే విధించాలంటూ ఆ పిటిషన్లో కోరింది. గౌహతి హైకోర్టు తీర్పుతో సీబీఐ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వల్ల 9వేల ట్రయల్స్, వేయి దర్యాప్తులపై ప్రభావం పడుతుందని తక్షణమే విచారణ జరపాలని కోరింది.