న్యూఢిల్లీ: ‘హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు చేపట్టకుండా న్యాయవ్యవస్థను స్తంభింపజేస్తారా’ అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీ, గువాహటి హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియామకం కోసం పది మంది పేర్లకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. వీరిలో ఢిల్లీ హైకోర్టుకు 5 మందిని, గువాహటి హైకోర్టుకు 5 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తారు.
ఢిల్లీ హైకోర్టుకు ప్రతిపాదించిన 5 మందిని జ్యుడీషియల్ సర్వీసెస్ నుంచి తీసుకుంటుండగా, గౌహతి హైకోర్టుకు ప్రతిపాదించిన 5 మందిని బార్ కౌన్సిల్ నుంచి, రాష్ట్ర న్యాయ సేవల నుంచి తీసుకుంటున్నారు. తుది ఆమోదం కోసం ప్రతిపాదనలను కేంద్రం రాష్ట్రపతి భవన్‌కు పంపించింది. ఈ వారాంతం కల్లా అనుమతి ఆమోదం లభించే అవకాశం ఉంది.
10 మంది జడ్జీలకు కేంద్రం క్లియరెన్స్
Published Wed, Nov 2 2016 9:55 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
Advertisement
Advertisement