
దారితప్పిన చంద్రబాబు హెలికాప్టర్.. ఆలస్యంగా కడపకు
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది. గంట ఆలస్యంగా నిర్ణీత ప్రదేశానికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సోమవారం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ రోజు సాయంత్రం అక్కడ నుంచి హెలికాప్టర్లో కడపకు బయల్దేరారు. అయితే సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పడంతో నిర్ణీత సమయానికి కడపకు వెళ్లలేదు. గంట ఆలస్యంగా కడపకు చేరుకుంది. దీంతో ఇరిగేషన్ అధికారులతో జరగాల్సిన సమీక్ష సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. కడప ఎయిర్పోర్టులోనే చంద్రబాబు కాసేపు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి.. విజయవాడకు బయల్దేరారు.