న్యూస్‌ చానల్‌ ఎడిటర్‌ అరెస్ట్‌ | Channel head arrested from Lucknow airport | Sakshi
Sakshi News home page

న్యూస్‌ చానల్‌ ఎడిటర్‌ అరెస్ట్‌

Published Fri, Apr 14 2017 10:33 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

న్యూస్‌ చానల్‌ ఎడిటర్‌ అరెస్ట్‌

న్యూస్‌ చానల్‌ ఎడిటర్‌ అరెస్ట్‌

లక్నో: మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా ప్రసారాలు చేస్తున్న ఓ న్యూస్‌ చానల్‌ సీఎండీ, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. సుదర్శన్‌ న్యూస్‌ అనే చానల్‌కు సురేష్‌ చావ్హంకే సీఎండీ, ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈయనను బుధవారం రాత్రి లక్నోలోని చౌదరి చరణ్‌సింగ్‌ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసి భారత శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఏప్రిల్‌ 6 నుంచి 8 మధ్య ఈ చానల్‌లో ప్రసారం చేసిన కార్యక్రమాల వల్ల ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపణలు రావడంతో ఏప్రిల్‌ 9న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎస్పీ ఎంపీ ఒకరు బుధవారం రాజ్యసభలోనూ ఈ అంశాన్ని లేవనెత్తి, సదరు చానెల్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. దీంతో పోలీసులు బుధవారం రాత్రే చానల్‌ ఎడిటర్‌ను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement