అఖిలేష్‌కు చేదు అనుభవం..! | Akhilesh yadav Stopped By UP Police At Lucknow Airport | Sakshi
Sakshi News home page

అఖిలేష్‌కు చేదు అనుభవం..!

Published Tue, Feb 12 2019 12:27 PM | Last Updated on Tue, Feb 12 2019 6:05 PM

Akhilesh yadav Stopped By UP Police At Lucknow Airport - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమం నిమిత్తం అలహాబాద్‌ వెళ్తున్న ఆయనను లక్నో ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి కారణం లేకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది తనను అడ్డుకున్నారంటూ అఖిలేష్‌ ట్వీట్‌ చేశారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంపై నిర్బంధం విధించి హక్కులను కాలరాస్తోందని తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

కారణంలేకుండా అడ్డుకోవడంతో పోలీసులకు అఖిలేష్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అలహాబాద్‌ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్న తనను పోలీసులు బంధించారని అఖిలేష్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. విమానం వెళ్లిపోయిన తరువాత ఆయనను బయటకు పంపించారు. 



I was prevented from boarding the airplane without any written orders. Currently detained at Lucknow airport.

It is clear how frightened the govt is by the oath ceremony of a student leader. The BJP knows that youth of our great country will not tolerate this injustice anymore! pic.twitter.com/xtnpNWtQRd

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement