చెన్నై: ప్రముఖ సినీగాయనీ కే.ఎస్ చిత్ర, నర్తకి పద్మ సుబ్రహ్మణంలు "ఉమెన్ అచీవర్ అవార్డులను అందుకోనున్నారు. రెయిన్ డ్రాప్స్ అనే సామాజిక సంస్థ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న నిర్వహించే మహిళా దినోత్సవం సందర్భంగా కే.ఎస్ చిత్ర, పద్మ సుబ్రహ్మణంలను ఉమెన్ అచీవర్ అవార్డులతో సత్కరించనున్నారు. రెండవ వార్షికోత్సవంలో భాగంగా మహిళా దినోత్సవం రోజున ఉమెన్ అచీవర్ అవార్డులను వారిద్దరికి ప్రదానం చేయనున్నట్టు రెయిన్ డ్రాప్స్ వెల్లడించింది.
అయితే ఈ వేడుకలకు ఏఆర్ రెహానా అధ్యక్షతన వహిస్తున్నట్టు రెయిన్స్ డ్రాప్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. చిత్ర, పద్మ సుబ్రహ్మణంతో పాటు మరికొంతమందికి ఉమెన్ అచీవర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వారిలో గాయనీ నిత్యాశ్రీ మహదేవన్, రచయిత కుట్టి రేవంతి, సామాజిక వ్యవస్థాపకుడు గిరిజ రాఘవన్, కాస్ట్యూమ్ డిజైనర్ వాసుకీ భాస్కర్ పలువురు ఈ అవార్డులు అందుకోనున్నట్టు రెయిన్ డ్రాప్స్ తెలిపింది. కాగా, 2013లో ప్రముఖ సినీగాయనీ పి. సుశీలకు ఉమెన్ అచీవర్ అవార్డును ప్రదానం చేశారు.
చిత్ర, పద్మలకు 'ఉమెన్ అచీవర్ అవార్డు'
Published Sat, Feb 8 2014 3:35 PM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
Advertisement
Advertisement