పీసీఐ చైర్మన్‌గా జస్టిస్ సీకే ప్రసాద్
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రమౌళి కుమార్ ప్రసాద్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం పీసీఐ చైర్మన్‌గా జస్టిస్ మార్కండేయ కట్జూ ఉన్నారు. పీసీఐ చైర్మన్ అభ్యర్థిని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ మేరకు ప్రసాద్‌ను పీసీఐ చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం అందిందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ అధికారులు వెల్లడించారు.
జస్టిస్ ప్రసాద్ పట్నా నగరంలో పుట్టిపెరిగారు. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన కొంతకాలం పట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేశారు. త్వరలోనే ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.