ముంబై: దేశీ కంపెనీలకు కార్పొరేట్ మోసాల బెడద అంతకంతకూ తీవ్రతరమవుతోంది. అంతర్జాతీయ ఏజెన్సీ ‘క్రాల్’ నిర్వహించిన గ్లోబల్ ఫ్రాడ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. తమకు ఇలాంటి కార్పొరేట్ మోసాలతో ఈ ఏడాది చాలా ఇబ్బందులు ఎదురైనట్లు సర్వేలో పాల్గొన్న 71 శాతం దేశీ కంపెనీలు పేర్కొనడం గమనార్హం. క్రితం ఏడాది సర్వేలో ఇలా పేర్కొన్న కంపెనీలు 67 శాతమే.
కాగా ఆస్తుల నష్టం, లంచాలు, అంతర్గత సమాచార చోరీ వంటి అనేక రకాలైన కార్పొరేట్ మోసాలను 69 శాతం దేశీ కంపెనీలు చవిచూస్తున్నాయని క్రాల్ పేర్కొంది. ఇక అవినీతి, లంచాలకు సంబంధించిన మోసాలు తమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సర్వేలో పాల్గొన్న 37 శాతం(క్రితం ఏడాది 32 శాతం) సంస్థలు వెల్లడించాయి. కొనుగోళ్ల సంబంధ మోసాలు, పెట్టుబడులకు అనుమతుల్లో జాప్యం, లంచాలు వంటివి వ్యాపారాలకు అడ్డంకిగా నిలుస్తున్నాయని అత్యధిక శాతం దేశీ, అంతర్జాతీయ కంపెనీలు అభిప్రాయపడినట్లు క్రాల్ ఇండియా హెడ్ రేష్మి ఖురానా పేర్కొన్నారు. జూనియర్‌స్థాయి ఉద్యోగులే ఇలాంటి మోసాలకు అత్యధికంగా పాల్పడుతున్నట్లు 69 శాతం కంపెనీలు చెప్పడం గమనార్హం.
కార్పొరేట్ మోసాలు పెరుగుతున్నాయ్!
Published Thu, Oct 24 2013 1:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement