భార్య శవాన్నిమోస్తూ 10 కి.మీ: అసలు నిజం | Dana Majhi did not seek any help: Odisha minister's reply to Assembly | Sakshi
Sakshi News home page

భార్య శవాన్నిమోస్తూ 10 కి.మీ: అసలు నిజం

Published Fri, Sep 23 2016 5:19 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

భార్య శవాన్నిమోస్తూ 10 కి.మీ: అసలు నిజం

భార్య శవాన్నిమోస్తూ 10 కి.మీ: అసలు నిజం

భువనేశ్వర్: అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన 'భార్య శవాన్ని మోస్తూ 10 కిలోమీటర్ల నడక' ఉదంతంలో 'అసలు నిజం ఇదీ..' అంటూ ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక సమాధానం సంచలనంగా మారింది. కలహండి జిల్లాలో ఆగస్టులో చోటుచేసకున్న ఈ సంఘటనలో భార్య శవాన్ని మోసుకెళ్లిన దనా మాంఝి ఏ ఒక్కరినీ సహాయం అడగలేదని, చనిపోయినట్లు అధికారికంగా నిర్ధారించకముందే చెప్పాపెట్టకుండా మృతదేహాన్ని తీసుకెళ్లాడని ప్రభుత్వం పేర్కొంది. (చనిపోయిన భార్యను భుజాన వేసుకొని..)

ఆసుపత్రిలోని ఇతర రోగులు, ప్రత్యక్ష సాక్షల ద్వారా సేకరించిన సమాచారం మేరకు కలహండి జిల్లా ముఖ్య వైద్యాధికారి ఒక రిపోర్టును తయారుచేశారు. ఆరోగ్య శాఖ మంత్రి అతాను సబ్యసాచి ఆ రిపోర్టును శుక్రవారం అసెంబ్లీలో వెల్లడించారు. మాంఝి వ్యవహారంపై ప్రభుత్వ స్పందన కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రఫుల్ కు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో.. దనా మాంఝి తన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తున్నట్లు ఆసుపత్రికి సిబ్బందికి చెప్పలేదని, ఒకవేళ అతని దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారానో లేక రెడ్ క్రాస్ నిధి ద్వారానో సహాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. (నిర్దయ భారతం)

మరణ ధృవీకరణ జరగకముందే, హడావిడిగా మాంఝీ తన భార్యను తీసుకెళ్లడం వల్లే ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కిందని, ఒకరు భుజాలపై శవాన్ని మోసుకెళుతున్నాడన్న సమాచారం తెలిసిన వెంటనే అంబులెన్స్ పంపామని వైద్యాధికారి నివేదికలో తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి స్టాఫ్ నర్స్ రాజేంద్ర రాణాను డిస్మిస్ చేయగా, సెక్యూరిటీ సంస్థకు తాఖీదులిచ్చామని పేర్కొన్నారు. పేదరికంలో మగ్గిపోతున్న మాంఝి కుటుంబానికి పలు స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ప్రకటించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement