ఆ బొమ్మతో నేనెలా కనెక్ట్‌ అవుతా?: నటి జైరా | Dangal actress Zaira Wasim in fresh row; spars with sports minister Vijay Goel on Twitter | Sakshi
Sakshi News home page

ఆ బొమ్మతో నేనెలా కనెక్ట్‌ అవుతా?: నటి జైరా

Published Fri, Jan 20 2017 4:51 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

Dangal actress Zaira Wasim in fresh row; spars with sports minister Vijay Goel on Twitter



'దంగల్‌' బాలనటి జైరా వసీం మరో వివాదానికి కేంద్రబిందువైంది. అయితే ఈ సారి వివాదాన్ని రేపిందిమాత్రం సాక్షాత్తూ కేంద్ర మంత్రి కావడం గమనార్హం. ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో గురువారం ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్‌గోయల్‌.. గ్యాలరీలోని ఓ బొమ్మను జైరా వసీంకు అన్వయించారు. పంజరంలో బందీ అయిన ముస్లిం యువతి బొమ్మను ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి.. 'ఈ ఫొటో జైరా వసీం పరిస్థితికి అద్దం పట్టేలా ఉంది. మన బాలికలు పంజరాన్ని బద్దలు కొట్టి ముందుకు సాగుతున్నారు..'అని విజయ్‌గోయల్‌ కామెంట్‌ చేశారు. కొద్దిసేపటికే జైరా వసీం మంత్రిగారి పోలికను తప్పుపడుతూ ప్రత్యుత్తరమిచ్చింది.

"సార్‌.. మీరు వర్ణించినట్లు ఈ బొమ్మతో నేనెలా కనెక్ట్‌ అవుతాను? అసలీ బొమ్మకు, నాకు కనీస సారూప్యత కూడా లేదు. అయితే మీకో విషయం చెప్పాలి.. బురఖా వేసుకునేవాళ్లు అందంగానేకాదు.. స్వేచ్ఛగానూ ఉంటారు..' అని జైరా వసీం మంత్రికి బదులిచ్చారు. దీంతో ఖంగుతిన్న మంత్రిగారు తన పోలికను సమర్థించుకుంటూ 'నా ఉద్దేశాన్ని నువ్‌(జైరా) తప్పుగా అర్థం చేసుకున్నావ్‌. నీ పరిధిలో నువ్వు ఎంతో సాధించావ్‌. అలాగే కట్టుబాట్లు, నిబంధనలను తెంచుకుంటూ బాలికలు ఎదగాలని కోరుకుంటున్నా..'అని విజయ్‌గోయల్‌ వ్యాఖ్యానించారు.

'దంగల్‌' సినిమాతో అద్భుతంగా నటించి స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న కశ్మీరీ బాలిక జైరా వసీం.. సీఎం మెహబూబా ముఫ్తీని కలవడంపై వివాదం చెలరేగడం, దానికి ఆమె వివరణ ఇచ్చుకోవడం, ఈ క్రమంలో పలువురు రాజకీ, సినీ ప్రముఖులు జైరాకు మద్దతు పలకండం తెలిసిందే. ముస్లిం బాలిక అయిన జైరాను 'పంజరంలో మహిళ' బొమ్మతో పోల్చడంపై మంత్రి గోయల్‌పైనా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
(చదవండి: గంభీర్ ఫైర్ అయ్యాడు)
(‘దంగల్‌’ జైరాకు బాలీవుడ్‌ మద్దతు)

This painting tells a story similar to @zairawasim, पिंजरा तोड़ कर हमारी बेटियां बढ़ने लगी हैं आगे | More power to our daughters!
2/2 pic.twitter.com/RaolLKrZeg

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement