వారికి నగదురూపంలో అడ్వాన్స్ జీతాలు! | Demonetisation: Central govt starts paying salaries in cash to Group C employees | Sakshi
Sakshi News home page

వారికి నగదురూపంలో అడ్వాన్స్ జీతాలు!

Published Mon, Nov 21 2016 7:08 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

వారికి నగదురూపంలో అడ్వాన్స్ జీతాలు! - Sakshi

వారికి నగదురూపంలో అడ్వాన్స్ జీతాలు!

పెద్ద నోట్ల రద్దు సంక్షోభంతో బ్యాంకులు, ఏటీఎం వద్ద నెలకొన్న చాంతాండ క్యూల నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి గ్రూప్-సీ ఉద్యోగులకు నగదు రూపంలో అడ్వాన్స్ జీతాలను కొత్త నోట్లతో ఇవ్వడం ప్రారంభించింది. నవంబర్ నెల జీతం కింద 10 వేల రూపాయలను అడ్వాన్గా సోమవారం నుంచి గ్రూప్-సీ ఉద్యోగులకు అందిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన అవాంతరానికి ఈసారి జీతాలను అడ్వాన్స్గా నగదు రూపంలో ఇవ్వాలని కేంద్రం ముందుగానే నిర్ణయించింది. ఈ మేరకు నేటినుంచి అడ్వాన్స్ జీతాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
 
హోం మంత్రిత్వశాఖలో కనీసం 1000 మంది గ్రూప్-సీ ఉద్యోగులు పనిచేస్తారని, వారందరూ రూ.10వేలను అడ్వాన్స్ జీతాన్ని పొందినట్టు తెలిసింది.  అన్ని మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్లు అసోసియేట్ ఆర్గనైజేషన్స్ గ్రూప్-సీ ప్రభుత్వోద్యోగులందరకూ అడ్వాన్స్ జీతాన్ని నగదు రూపంలో అందిస్తున్నట్టు ఓ సీనియర్ హోం మంత్రిత్వశాఖ అధికారి తెలిపారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖలో నాలుగు సిప్ట్లలో కౌంటర్లు ఏర్పరిచారు.  నార్త్ బ్లాక్లోని ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు తమ వేతనాలను నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement