Group C employees
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా గ్రూప్ సీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు 'బి'లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది దీపావళి పండగ సీజన్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి 30 రోజుల వేతనాలకు సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(అడ్-హాక్ బోనస్)ను గ్రూప్ 'సీ'లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు 'బి'లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరు ఎలాంటి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీం కింద కవర్ కారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ తాత్కాలిక బోనస్ సెంట్రల్ పారా మిలటరీ దళాలు, సాయుధ దళాలలో అర్హులైన ఉద్యోగులకు కూడా లభిస్తుంది. కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుంది. ఇతర బోనస్ లేదా ఎక్స్ గ్రేషియా దీని కింద కవర్ చేయబడదు" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ(డిఓఈ) ఈ రోజు(అక్టోబర్ 18) ఆఫీస్ మెమోరాండంలో తెలిపింది. 31-3-2021 నాటికి సర్వీసులో ఉండి 2020-21 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సేవ చేసిన ఉద్యోగులు మాత్రమే అడ్ హాక్ బోనస్ చెల్లింపుకు అర్హులు. (చదవండి: దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే!) -
ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు
ఖమ్మంవ్యవసాయం: నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్–సీ(ఎఫ్‌ఎన్‌పీఓ), నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ (ఎన్‌యూపీఈ) రెందో ద్వై వార్షిక మహాసభలను ఖమ్మంలో నిర్వహిచడానికి ఆయా యూనియన్ల తెలంగాణ సర్కిల్ యూనియన్లు నిర్ణయించాయి. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఖమ్మం నగరంలోని స్టేషన్ రోడ్లో ఉన్న శాంతి హోటల్ వేదికగా నిర్వహించడానికి నిర్ణయించారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు సంయుక్త ఓపెన్ సెషన్‌తో కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించా రు. ఈ మహాసభల్లో ఎన్‌యూజీడీఎస్, ఎఐజీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ డిమాండ్లపై ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మెపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులు 16రోజుల పాటు చారిత్రక సమ్మె అనంతరం జరిగిన పరిస్థితులు, డిపార్ట్మెంట్ ఒప్పుకున్న హామీలు అమలు, పెం డింగ్ అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఉద్యోగులు, జీడీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక రకాల సాంకేతిక ఇబ్బందులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను చర్చించి వాటి సాధనకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చ ఉంటుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్, గౌరవ అతిథులుగా హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆకాష్దీప్ చక్రవర్తి, పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్లు వీవీ సత్యనారాయణరెడ్డి, ఎస్వీరావుల ను ఆహ్వానించారు. కార్యక్రమ నిర్వహణకు రిసెప్షన్ కమిటీగా జి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిసీహెచ్ కోటేశ్వరరావు, కోశాధ్యక్షుడిగా సీహెచ్ఎస్బీవీబీకుమార్ను నియమించారు. ఎఫ్ ఎన్పీఓ ఖమ్మం డివిజన్ గ్రూప్–సీ అధ్యక్షుడు పమ్మి వెంకటేశ్వరరావు కార్యక్రమ నిర్వహణలో భాగంగా వివిధ బ్రాంచ్‌ల అధ్యక్ష, కార్యదర్శుల తో సమావేశాలు నిర్వహిస్తూ, కార్యక్రమ విజయవంతానికి ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్లోని శాఖల అన్ని కార్యాలయాలకు కార్యక్రమ వివరాలను వివిధ రకాలుగా యూనియన్ నాయకులు చేరవేస్తున్నారు. -
వారికి నగదురూపంలో అడ్వాన్స్ జీతాలు!
పెద్ద నోట్ల రద్దు సంక్షోభంతో బ్యాంకులు, ఏటీఎం వద్ద నెలకొన్న చాంతాండ క్యూల నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి గ్రూప్-సీ ఉద్యోగులకు నగదు రూపంలో అడ్వాన్స్ జీతాలను కొత్త నోట్లతో ఇవ్వడం ప్రారంభించింది. నవంబర్ నెల జీతం కింద 10 వేల రూపాయలను అడ్వాన్‌గా సోమవారం నుంచి గ్రూప్-సీ ఉద్యోగులకు అందిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన అవాంతరానికి ఈసారి జీతాలను అడ్వాన్స్‌గా నగదు రూపంలో ఇవ్వాలని కేంద్రం ముందుగానే నిర్ణయించింది. ఈ మేరకు నేటినుంచి అడ్వాన్స్ జీతాన్ని ప్రభుత్వం అందిస్తోంది. హోం మంత్రిత్వశాఖలో కనీసం 1000 మంది గ్రూప్-సీ ఉద్యోగులు పనిచేస్తారని, వారందరూ రూ.10వేలను అడ్వాన్స్ జీతాన్ని పొందినట్టు తెలిసింది. అన్ని మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్లు అసోసియేట్ ఆర్గనైజేషన్స్ గ్రూప్-సీ ప్రభుత్వోద్యోగులందరకూ అడ్వాన్స్ జీతాన్ని నగదు రూపంలో అందిస్తున్నట్టు ఓ సీనియర్ హోం మంత్రిత్వశాఖ అధికారి తెలిపారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖలో నాలుగు సిప్ట్లలో కౌంటర్లు ఏర్పరిచారు. నార్త్ బ్లాక్‌లోని ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు తమ వేతనాలను నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.