పెళ్లిలో తాగి హత్య చేసిన అతిథులు | Denied more Bollywood songs, wedding guests murder groom father | Sakshi
Sakshi News home page

పెళ్లిలో తాగి హత్య చేసిన అతిథులు

Published Sun, Jul 26 2015 3:12 PM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

పెళ్లిలో తాగి హత్య చేసిన అతిథులు - Sakshi

పెళ్లిలో తాగి హత్య చేసిన అతిథులు

డెహ్రాడూన్: వైభవంగా జరుగుతున్న ఓ కల్యాణానికి వెళ్లిన అతిథులు పెళ్లి కూతురు తండ్రిని హత్య చేశారు. తమ డిమాండ్కు అంగీకరించలేదని ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. ఇంతకీ వారి డిమాండ్ ఏమిటని అనుకుంటున్నారా.. ఆ అతిధులకు బాలీవుడ్ పాటలు పెట్టలేదని కోపం వచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళ్లితే ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాలోని సాకోటి అనే గ్రామంలో కొందరు యువకులు వివాహ కార్యక్రమానికి వెళ్లారు. వెళ్లినవారు పీకల దాకా తాగేశారు.

సాధరణంగా తాగితే నానా రచ్చ చేయడం మందుబాబులకు అలవాటే. అలాగే, పెళ్లిలో తాగిన వీరంతా కూడా పెళ్లిలో బాలీవుడ్ పాటలు ఇంకా పెట్టాలంటూ రచ్చకు దిగారు. తమ డ్యాన్సులు ఇంకా పూర్తి కాలేదంటూ పెళ్లికార్యక్రమాలకు పదేపదే అడ్డుతగులుతున్నారు. దీంతో పెళ్లి కూతురు తండ్రి జోక్యం చేసుకొని డీజే ఆఫ్ చేశాడు. దీంతో మత్తులో ఉన్న యువకులు ఊగిపోతూ ఆయనతో వివాదానికి దిగారు. వారిలో ఒకరు తుపాకీ తీసి పాయింట్ బ్లాంక్లో పెట్టి బెదిరించాడు. దీంతో కోపానికి లోనైన పెళ్లి కూతురు తండ్రి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో అతడు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో పెళ్లి కూతురు తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement