ఉద్యోగులకు రూ.80 కోట్ల బంపర్ బొనాంజా
ప్రముఖ ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబరేటరీస్ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. దాదాపు రూ.80 కోట్లను ఉద్యోగులు, మరియు శాశ్వత డైరెక్టర్లకు ప్రత్యేక చెల్లింపులు చెల్లించనుంది. 25 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈ బంపర్ ఆఫర్ ను కంపెనీ ప్రకటించింది. మొత్తం రూ.79 కోట్లను ఒక-సమయం చెల్లింపుగా ఉద్యోగులు, శాశ్వత డైరెక్టర్లకు స్పెషల్ పేమెంట్ కింద లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు కంపెనీ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది. దీని ప్రభావం సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రతిబింబించనుందని దివీస్ పేర్కొంది.
హైదరాబాద్ ఆధారిత ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబ్స్ ను1990లో స్థాపించారు. కంపెనీలో ప్రస్తుతం పదివేలకుపైగా ఉద్యోగులున్నారు. కాగా శుక్రవారం దివీస్ మొదటి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం 23 శాతం పెరిగి రూ. 302 కోట్లను కోట్లకు పెరిగి మార్కెట్ల అంచనాలకు మించిన ఫలితాలను నమోదు చేసింది. అమ్మకాల్లో 25 శాతం వృద్ధి సాధించి రూ 1,006 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 2.68 శాతం దూసుకెళ్లి 37.32 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో దివీస్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో దివీస్ ల్యాబ్ షేరు 7 శాతానికి పై గా లాభపడి 52 వారాల గరిష్టాన్ని తాకింది.