బ్రెడ్ ఫోర్క్ వాడినందుకు విడాకులు! | divorce using bred fork instead of fork | Sakshi

బ్రెడ్ ఫోర్క్ వాడినందుకు విడాకులు!

Published Wed, Jan 1 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

బ్రెడ్ ఫోర్క్ వాడినందుకు విడాకులు!

బ్రెడ్ ఫోర్క్ వాడినందుకు విడాకులు!

ఈ ఫొటోలో ఎడమ వైపున ఉన్నది బ్రెడ్ ఫోర్క్.. గతంలో వాడేవారులెండి.

ఈ ఫొటోలో ఎడమ వైపున ఉన్నది బ్రెడ్ ఫోర్క్.. గతంలో వాడేవారులెండి. ఇక పక్కనున్నది ఫోర్క్. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. పచ్చి బఠాణీ తినడానికి ఫోర్క్‌కు బదులు బ్రెడ్ ఫోర్క్ వాడినందుకు కువైట్‌లో ఓ మహిళ పెళ్లైన వారం రోజులకే భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ కోర్టుకెక్కింది! అతనికి టేబుల్ మ్యానర్స్ లేదని.. జీవితమంతా భర్తతో కలిసి ఉండ టం అసాధ్యమంటూ వాపోయింది. విడాకులు తీసుకోవడానికి ఇదేం కారణం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, అక్కడే గతంలో జరిగిన మరో ఉదంతం గురించి వినండి.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.

 

టూత్‌పేస్ట్ వేసుకునేటప్పుడు ట్యూబ్ చివర్న కాకుండా మధ్యలోనే నొక్కాలని భర్త చెబుతున్నాడంటూ అక్కడ ఓ మహిళ విడాకుల కోసం కోర్టుకెక్కింది!  ‘దీని మీద మేమెన్నోసార్లు వాదించుకున్నాం. అయ్యో.. ట్యూబ్ చివర్న నొక్కాలయ్యా అంటే వినడే. మూర్ఖుడు’ అంటూ అంతెత్తున లేచింది. మరొక కేసు విషయానికొస్తే.. తాను అడిగినప్పుడు మంచి నీళ్లు తేలేదనే కారణంతో భార్య నుంచి విడాకులిప్పించాలని ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు. కువైట్‌లో ఇలా చిత్రవిచిత్ర కారణాల మీద విడాకులు కోరేవారి సంఖ్య ఎక్కువైపోతోందని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement