ఆయన రూపంలో సద్దాం బతికే ఉన్నాడా..!
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారన్నది ఎంత నిజమోగానీ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్కు, ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్కు చాలా దగ్గరి పోలికలున్నాయి. రూపాలు వేరైనా ఇద్దరి అభిరుచులు, ఆలోచనా విధానాలు దాదాపు సేమ్ టు సేమ్ అంటే ఆశ్చర్యం కలగకమానదు. వయసు రీత్యా సద్దాంకు, ట్రంప్‌కు తొమ్మిదేళ్లు తేడా. అయితే చరిత్ర దృష్టికోణంలో ఈ ఇద్దరూ ఒకే తరం మనునషులు. వాళ్ల తరంలో డబ్బున్న మారాజులు ఎందరో ఉన్నా, కొత్తగా ఇంకొందరు కుబేరులు తయారవుతున్నా.. ఆడంబరాల విషయంలో మాత్రం ఈ ఇద్దరూ ఇద్దరే! ఉన్నది దాచుకోకుండా ‘షో మ్యాన్’ పోజు కొట్టడంలో ప్రసిద్ధులే!
భూగోళంమీద విభిన్న ప్రాంతాల్లో పుట్టిన ఈ ఇద్దరికీ విలాసాలంటే మక్కువ ఎక్కువ. అతిథుల కోసం ఏర్పాటుచేసిన గెస్ట్ రూమ్‌ల నుంచి వ్యక్తిగత విశ్రాంతి పొందే బెడ్‌రూమ్‌ల దాకా, వారి రాజప్రసాదాల్లోని మెట్ల నిర్మాణం నుంచి తళుకులు విరజిమ్మే షాండ్లియార్ల ఏర్పాటుదాకా సద్దాం, ట్రంప్‌లు ఒకేలా ఆలోచించారు. న్యూజెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, ఫ్లోరిడాల్లోని ట్రంప్ సౌధాలు.. బాగ్ధాద్, టిక్రిట్‌ల్లో సద్దాం నిర్మించి, నివసించిన భవంతులు చూడటానికి ఒకేలా ఉండటాన్ని గమనిస్తే.. ‘సై’ సినిమా కోసం చంద్రబోస్ రాసిన‘నాలా ఇంకొకరు.. ఆలోచిస్తున్నారు.. ’ అనే పాట నిజమనిపిస్తుంది.
దారుణ రీతిలో సద్దాం హుస్సేన్ శకం ముగిసిన తర్వాత, అంతవరకూ ఆయన బూటుకాలికింద నలిగిన ఉగ్రవాదం ఒక్కసారిగా జడలువిప్పింది. ప్రపంచానికి పెనుసవాళ్లు విసిరింది. అందుకే ‘సద్దాం బతికే ఉంటే ఈ ప్రపంచం ఇప్పుడున్నట్లు కాకుండా మరోలా ఉండేది’అని చరిత్రకారులు అంటారు. ఆఖరికి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ట్రంప్ కూడా ఎన్నికల ప్రచారంలో అదేమాట చెప్పాడు.. ‘ఇరాక్‌లో సద్దాం హుస్సేన్, లిబియాలో మొహమ్మద్ గడాఫీలు గనుక బతికే ఉంటే ఈ ప్రపంచం ఇకా బాగుండేది’అని! ‘నిజమే, సద్దాం చచ్చిపోయాడు. కానీ ఆయన అభిరుచులను, అలవాట్లను కొనసాగిస్తున్న డోనాల్డ్ ట్రంప్ రూపంలో సద్దాం ఇంకా బతికే ఉన్నాడు’ అని ఎవరైనా అంటే కాదనగలమా?
1. ఫ్లోరిడాలోని ట్రంప్ ‘మారాలొగో’ మ్యాన్షన్- ఇరాక్‌లోని సద్దాం వేసవి విడిది
2. ట్రంప్ ‘మారాలోగో’- టెక్రిట్‌లోని సద్దాం ప్యాలెస్
3. న్యూజెన్సీలోని ‘ట్రంప్ తాజ్‌మహల్’ బెడ్‌రూమ్ - బాగ్ధాద్‌లోని ‘అల్‌ఫావ్ ప్యాలెస్’ పడకగది
4. ట్రంప్ తాజ్‌మహల్ క్యాసినో(న్యూజెర్సీ)- సద్దాం కీర్తికట్టడం అల్ షహీబ్(బగ్దాద్)
5. మారాలోగో భవంతిలో ‘అతిథి మర్యాద’ల ప్రదేశం- టెక్రిట్ ప్యాలెస్‌లో డైనింగ్ హాల్
6. మారాలోగో, అల్‌ఫావ్ ప్యాలెస్‌లలో జిగేల్మంటోన్న షాండ్లియార్లు
7.అతిథుల కోసం..
8.ఒకేలా ఆలోచించిన డోనాల్డ్ ట్రంప్- సద్దాం హుస్సేన్..