Palaces
-
ప్రపంచంలో ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు - అడుగడుగునా రాజసం (ఫోటోలు)
-
12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలో అతిపెద్ద ప్యాలెస్!
World's Largest Private Palace in India: ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాలెస్ ఎక్కడ ఉంది అంటే చాలా మంది ప్యారిస్లోనో లేదా వేరే ఇతర దేశాల్లోనో ఉంటుందనుకుంటారు. కానీ ప్రపంచంలోనే చాలా పెద్దదైన ప్రైవేట్ ప్యాలెస్ భారతదేశంలోనే ఉంది. అదే 'లక్ష్మీ విలాస్ ప్యాలెస్' (Laxmi Vilas Palace). ఈ ప్యాలెస్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? దీని నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్.. బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉందని నివేదిలకు చెబుతున్నాయి. దీని నిర్మాణకి ఏకంగా 12 సంవత్సరాల సమయం పట్టినట్లు సమాచారం. 1890లో మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్ నిర్మాణానికి అయిన ఖర్చు అప్పట్లో రూ. 27,00,000 అని చెబుతున్నారు. ఈ మహల్ విలువ వేలకోట్లలో ఉంటుంది. వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ప్యాలెస్ ఇప్పటికి కూడా అతి పెద్ద ప్రైవేట్ ప్యాలెస్‌గా కీర్తి పొందింది. దీని నిర్మాణ సమయంలో ఎలివేటర్లు వంటి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కట్టుదిట్టం చేశారు. అత్యంత అందమైన ఈ భవనం మేజర్ చార్లెస్ మాంట్ అనే వాస్తు శిల్పి సారథ్యంలో పురుడు పోసుకుంది. దీని లోపల భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్‌ను గుర్తు చేస్తుంది. (ఇదీ చదవండి: వందల కోట్లు సామ్రాజ్యం సృష్టించిన కూలీ కొడుకు - ఎవరీ ముస్తఫా?) ప్రస్తుతం ఈ ప్యాలెస్ రాజకుటుంబానికి హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ నాయకత్వంలో ఉన్నట్లు సమాచారం. ఈయన రాధికారాజే గైక్వాడ్‌ను వివాహం చేసుకున్నారు. హోసింగ్.కామ్ ప్రకారం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విస్తీర్ణం 3,04,92,000 చదరపు అడుగులు, బకింగ్‌హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులు అని తెలుస్తోంది. ఇక ముఖేష్ అంబానీ యాంటిలియా విస్తీర్ణం 48,780 చదరపు అడుగులు కావడం విశేషం. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) 170 గదులతో కూడిన ఈ ప్యాలెస్ లోపల గోల్ఫ్ కోర్స్ కూడా ఉన్నట్లు సమాచారం. దర్బార్ హాల్ వెనీషియన్ మొజాయిక్ ఫ్లోర్, వెలుపల నీటి ఫౌంటైన్లతో కూడిన విశాలమైన తోట ఉంది. అంతే కాకుండా ఇందులో పాత ఆయుధాలు, శిల్పాలతో మ్యూజియం ఉంది. ఇందులో ప్రేమ్ రోగ్, దిల్ హి తో హై, సర్దార్ గబ్బర్ సింగ్, గ్రాండ్ మస్తీ వంటి అనేక సినిమా షూటింగులు జరిగాయి. -
భారతదేశంలోని టాప్ 10 అందమైన రాజభవనాలు
-
రాణివాసం కన్నా... సమాజమే మిన్న...
భంజ్ యువరాణులు మృణాళిక, అక్షితలు రాజవంశంలో పుట్టినా సాధారణ యువతుల్లాగే భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిద్దరూ ఫిక్కీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే... మా ప్యాలెస్...టూరిస్ట్ ప్లేస్‌గా... మా జిల్లా గురించి గొప్పగా చెప్పుకోలేని పరిస్థితే మా ప్రాంతాన్ని తీర్చిదిద్దే వైపు మమ్మల్ని పురికొల్పింది. అందులో భాగంగా స్థానికుల్ని స్వయం ఉపాధి దిశగా నడిపించడం, స్థానిక హస్తకళలకు చేయూత అందించడం.. వంటివి చేశాం. మా హస్తకళల బ్రాండ్ హసా అటెలియర్ సబాయి గడ్డితో చేసిన సంచుల విక్రయాలకు పేరు. వీటిని తరచు డోక్రాతో (ఒడిశాలోని గిరిజనులు చేసే ఓ రకమైన మెటల్‌వర్క్) జత చేసి విక్రయిస్తాం. ఇలా స్థానికులకు ఉపాధితో పాటు స్థానిక కళలకు కూడా ఖ్యాతి దక్కుతోంది. అదే క్రమంలో 20 ఎకరాల్లో ఉన్న మా ప్యాలెస్‌ను 11 గదుల బోటిక్ హోటల్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాం. మా ఇంటిని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దే క్రమంలో మా తండ్రిగారిని ఒప్పించి ఆయన సూచనలు, సహకారంతో ఒక్క ఇటుక కూడా కొత్తగా జోడించకుండా, చారిత్రక ఆనవాళ్లేమీ చెరిగిపోకుండానే ప్యాలెస్‌ను ఆ«ధునికంగా తీర్చిదిద్దాం. మేం దీనిని ప్రారంభించిన కొద్దికాలానికే కోవిడ్ వచ్చింది. అయితే కోవిడ్ అనంతరం ప్రారంభమైన రివెంజ్ ట్రావెల్... మాకు అనూహ్యమైన ప్రోత్సాహాన్నిచ్చింది. మా జిల్లాకు ఒక మారుమూల అటవీ ప్రాంతంగా కాకుండా ఓ మంచి పర్యాటక కేంద్రంగా గుర్తింపు వచ్చింది. అయితే ఈ పయనం మాకెన్నో మెలకువలు, పాఠాలూ నేర్పింది. హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్ ఉంది, రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ ప్యాలెస్ ఉంది... మరి మయూర్భంజ్లోని మా ప్యాలెస్‌కే ఎందుకు రావాలి.. అనే ప్రశ్నకు సమాధాన గా మేం మా చరిత్రను కథగా మలచి అతిథులకు పంచుతున్నాం. ప్రత్యేకంగా వికలాంగులకు అనుకూలమైన మరో రెండు గదులను ఇటీవలే జోడించాం. ప్రతి అడుగూ చరిత్రకు అద్దం పట్టేలా తీర్చిదిద్దాం’’ అంటూ తమ విజయగాథను పంచుకున్నారు.. ఇదేకాదు.. ఒకరు యోగా టీచర్‌గా రాణిస్తుంటే మరొకరు రచయిత్రిగా... ఇలా భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటున్నారు ఈ యువరాణులు. మా ప్రాంతానికి ‘కళ’తేవాలని... మా కుటుంబానికి దాదాపు 1000 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉంది. అయితే ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న 200 ఏళ్ల నాటి పూర్వీకుల ఇల్లు బెల్గాడియా ప్యాలెస్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం దగ్గర నుంచి చేసిన ప్రతి పనీ మేం రాజకుటుంబ వారసత్వం అనే పరదాల నుంచి బయటకు వచ్చి చేసినవే. అంతర్జాతీయ కళాకారులను ఆహ్వానిస్తూ మయూర్భంజ్ ఆర్ట్స్ – కల్చర్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నాం. మా ప్యాలెస్‌ని ఆర్టిస్ట్ రెసిడెన్సీగా మార్చాం. –మృణాళిక, అక్షిత – సాక్షి హైదరాబాద్ సిటీ బ్యూరో ఫొటో: మోహనాచారి -
ఇక బ్రాండ్ ‘తాజ్’ ఒక్కటే!
ఇండియన్ హోటల్స్‌కు కొత్తరూపు.. • ఆతిథ్య సేవలన్నీ ఒకే బ్రాండ్ పేరుతో • ఒక్కటి కానున్న తాజ్ హోటల్స్, ప్యాలసెస్, రిసార్ట్స్, సఫారీస్ • గేట్‌వే, వివాంటా హోటళ్లూ తాజ్ కిందకు • డిసెంబర్ నాటికి ప్రక్రియ పూర్తి ముంబై: టాటాగ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) పునర్నిర్మాణ ప్రక్రియ దిశగా చర్యలు ప్రారంభించింది. తన పరిధిలోని అన్ని హోటల్స్‌ను ‘తాజ్ హోటల్స్ ప్యాలసెస్ రిసార్ట్స్ సఫారీస్’ పేరుతో ఒకే బ్రాండ్ కిందకు తీసుకురానున్నట్టు ఐహెచ్‌సీఎల్ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం తాజ్ హోటల్స్, తాజ్ ప్యాలసెస్, తాజ్ రిసార్ట్స్, తాజ్ సఫారీస్ అనే నాలుగు విభాగాలతో భిన్నమైన ఆతిథ్య సేవలు అందిస్తుండగా... ఇవన్నీ తాజ్ బ్రాండ్ కిందకు రానున్నాయి. నూతనంగా ఏర్పడే బ్రాండ్ స్వరూపం తాజ్ వారసత్వాన్ని గౌరవించే విధంగా, గొప్ప బ్రాండ్‌గా ఉంటుందని, తమ వాటాదారులకు గణనీయమైన విలువను తెచ్చిపెడుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా వివాంటా, గేట్‌వే పేర్లు కనుమరుగవుతాయి. దేశంలోనూ, దేశం వెలుపల ఉన్న వివాంటా, గేట్‌వే హోటళ్లన్నీ తాజ్ బ్రాండ్ కిందకు వస్తాయని తాజ్ హటల్స్ ప్యాలసెస్ రిసార్ట్స్ సఫారీస్ సీఈవో, ఎండీ రాకేశ్ సర్నా గురువారం ముంబైలో విలేకరులకు తెలిపారు. పునర్నిర్మాణ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ నాటికి ముగుస్తుందన్నారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఇండియన్ హోటల్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 64 చోట్ల 101 ప్రదేశాల్లో హోటళ్లు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద హోటళ్ల గ్రూపుగా ఇది కొనసాగుతోంది. ఎనిమిదేళ్ల క్రితమే ప్రారంభం... గేట్‌వే, వివాంటా పేరుతో ఎనిమిదేళ్ల క్రితమే హోటల్స్ ప్రారంభం అయ్యాయి. దేశీయ మార్కెట్లో అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీనిచ్చే వ్యూహంలో భాగంగా ఐహెచ్‌సీఎల్ ఈ బ్రాండ్ల పేరుతో హోటళ్లను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అయితే, ఇవి పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈ రెండు బ్రాండ్ల కింద అందిస్తున్న సేవల విషయమై కస్టమర్లలో అవగాహన లేదని ఐహెచ్‌సీఎల్ ఉద్యోగి ఒకరు స్వయంగా పేర్కొనడం గమనార్హం. తాజా ఏకీకరణ చర్యలతో దేశీయంగా అతిపెద్ద ఆతిథ్య బ్రాండ్‌గా తాజ్ నిలుస్తుంది. ప్రధానంగా పేరుకుపోయిన రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు, లాభాలను గడించడం, తాజ్ బ్రాండ్‌కు మరింత బలాన్ని తీసుకొచ్చేందుకు ఐహెచ్‌సీఎల్ తాజా చర్యలను చేపట్టినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆయన రూపంలో సద్దాం బతికే ఉన్నాడా..!
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారన్నది ఎంత నిజమోగానీ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌కు, ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్‌కు చాలా దగ్గరి పోలికలున్నాయి. రూపాలు వేరైనా ఇద్దరి అభిరుచులు, ఆలోచనా విధానాలు దాదాపు సేమ్ టు సేమ్ అంటే ఆశ్చర్యం కలగకమానదు. వయసు రీత్యా సద్దాంకు, ట్రంప్‌కు తొమ్మిదేళ్లు తేడా. అయితే చరిత్ర దృష్టికోణంలో ఈ ఇద్దరూ ఒకే తరం మనునషులు. వాళ్ల తరంలో డబ్బున్న మారాజులు ఎందరో ఉన్నా, కొత్తగా ఇంకొందరు కుబేరులు తయారవుతున్నా.. ఆడంబరాల విషయంలో మాత్రం ఈ ఇద్దరూ ఇద్దరే! ఉన్నది దాచుకోకుండా ‘షో మ్యాన్’ పోజు కొట్టడంలో ప్రసిద్ధులే! భూగోళంమీద విభిన్న ప్రాంతాల్లో పుట్టిన ఈ ఇద్దరికీ విలాసాలంటే మక్కువ ఎక్కువ. అతిథుల కోసం ఏర్పాటుచేసిన గెస్ట్ రూమ్‌ల నుంచి వ్యక్తిగత విశ్రాంతి పొందే బెడ్రూమ్ల దాకా, వారి రాజప్రసాదాల్లోని మెట్ల నిర్మాణం నుంచి తళుకులు విరజిమ్మే షాండ్లియార్ల ఏర్పాటుదాకా సద్దాం, ట్రంప్‌లు ఒకేలా ఆలోచించారు. న్యూజెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, ఫ్లోరిడాల్లోని ట్రంప్ సౌధాలు.. బాగ్ధాద్, టిక్రిట్ల్లో సద్దాం నిర్మించి, నివసించిన భవంతులు చూడటానికి ఒకేలా ఉండటాన్ని గమనిస్తే.. ‘సై’ సినిమా కోసం చంద్రబోస్ రాసిన‘నాలా ఇంకొకరు.. ఆలోచిస్తున్నారు.. ’ అనే పాట నిజమనిపిస్తుంది. దారుణ రీతిలో సద్దాం హుస్సేన్ శకం ముగిసిన తర్వాత, అంతవరకూ ఆయన బూటుకాలికింద నలిగిన ఉగ్రవాదం ఒక్కసారిగా జడలువిప్పింది. ప్రపంచానికి పెనుసవాళ్లు విసిరింది. అందుకే ‘సద్దాం బతికే ఉంటే ఈ ప్రపంచం ఇప్పుడున్నట్లు కాకుండా మరోలా ఉండేది’అని చరిత్రకారులు అంటారు. ఆఖరికి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ట్రంప్ కూడా ఎన్నికల ప్రచారంలో అదేమాట చెప్పాడు.. ‘ఇరాక్‌లో సద్దాం హుస్సేన్, లిబియాలో మొహమ్మద్ గడాఫీలు గనుక బతికే ఉంటే ఈ ప్రపంచం ఇకా బాగుండేది’అని! ‘నిజమే, సద్దాం చచ్చిపోయాడు. కానీ ఆయన అభిరుచులను, అలవాట్లను కొనసాగిస్తున్న డోనాల్డ్ ట్రంప్ రూపంలో సద్దాం ఇంకా బతికే ఉన్నాడు’ అని ఎవరైనా అంటే కాదనగలమా? 1. ఫ్లోరిడాలోని ట్రంప్ ‘మారాలొగో’ మ్యాన్షన్- ఇరాక్‌లోని సద్దాం వేసవి విడిది 2. ట్రంప్ ‘మారాలోగో’- టెక్రిట్లోని సద్దాం ప్యాలెస్ 3. న్యూజెన్సీలోని ‘ట్రంప్ తాజ్‌మహల్’ బెడ్రూమ్ - బాగ్ధాద్లోని ‘అల్ఫావ్ ప్యాలెస్’ పడకగది 4. ట్రంప్ తాజ్‌మహల్ క్యాసినో(న్యూజెర్సీ)- సద్దాం కీర్తికట్టడం అల్ షహీబ్(బగ్దాద్) 5. మారాలోగో భవంతిలో ‘అతిథి మర్యాద’ల ప్రదేశం- టెక్రిట్ ప్యాలెస్‌లో డైనింగ్ హాల్ 6. మారాలోగో, అల్ఫావ్ ప్యాలెస్‌లలో జిగేల్మంటోన్న షాండ్లియార్లు 7.అతిథుల కోసం.. 8.ఒకేలా ఆలోచించిన డోనాల్డ్ ట్రంప్- సద్దాం హుస్సేన్..