నేడు మోదీతో ట్రంప్ మాటాముచ్చట!
అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్ చేయనున్నారు. అమెరికాతో భారత్ సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మోదీతో ట్రంప్ మాట్లాడనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
వైట్‌హౌస్ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడి మంగళవారం షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం ఒంటిగంటకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు) ట్రంప్ మోదీతో ఫోన్‌లో మాట్లాడానున్నారు. గత నవంబర్‌లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ శుభాభినందనలు తెలిపారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలోనూ భారత్-అమెరికా సంబంధాలను మరింత పెంపొందించుకునేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ట్రంప్‌తో పనిచేసేందుకు సిద్ధమని ప్రధాని మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్‌తో సదవగాహన ఏర్పరుచుకోవడంలో భారత్ ఏమాత్రం జాప్యం చేయకూడదని దౌత్య నిపుణులు సూచిస్తున్నారు.
Public schedule for President Trump tomorrow. // Spicer briefing set for 1:30 pic.twitter.com/16vlUQYEdr
— Zeke Miller (@ZekeJMiller) 24 January 2017