ఇన్వెస్ట్‌మెంట్‌కు వ్యవధి కీలకం... | duration important to investment | Sakshi
Sakshi News home page

ఇన్వెస్ట్‌మెంట్‌కు వ్యవధి కీలకం...

Published Mon, Feb 17 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

duration important to investment

మార్కెట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని మంచి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను సూచిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో రూ. 5 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన ఫండ్స్‌ను సూచించండి?
 - రామరాజు, విజయనగరం
 ప్రస్తుతమున్న మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి నా రికమండేషన్లు ఉండవు. ఇన్వెస్ట్‌మెంట్ కాలాన్ని బట్టి నా రికమండేషన్లు ఉంటాయి. 10-15 ఏళ్ల కాలం పాటు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాను. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోలేని వాళ్లు, రిస్క్‌ను భరించలేని వాళ్లకైతే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ ఉత్తమం. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ దాదాపు ఒక్కలాగే ఉంటాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఒడిదుడుకులు తక్కువ. ఒక వేళ మీ ఇన్వెస్ట్‌మెంట్ గడువు మూడేళ్లే అయితే, ఈక్విటీ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచించకపోవడమే మంచిది.

 మీరు ఎలాంటి పన్నులు చెల్లించని వారైతే, బ్యాంక్ డిపాజిట్లు ఉత్తమం. ఒకవేళ మీరు ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నట్లైతే, ఫిక్స్‌డ్ మెచ్యురిటీ ప్లాన్‌ను పరిశీలించవచ్చు. ఈ రిటర్న్‌లపై మీకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా రిటర్న్‌లు బ్యాంక్ డిపాజిట్లకంటే మెరుగ్గానే ఉండే అవకాశాలున్నాయి. అందుకని మార్కెట్ పరిస్థితులను బట్టి కాకుండా మీరు ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేయగలరు అన్న అంశాన్ని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలను తీసుకోవాలి.

 పదేళ్ల తర్వాత నా కూతురి పెళ్లి  చేయాలనుకుంటున్నాను. దీని కోసం కొంత నిధిని ఏర్పాటు చేయడం లక్ష్యంగా నేను 2011 నుంచి ఎల్‌ఐసీ ఎండోమెంట్ ప్లస్ పాలసీ కోసం ఏడాదికి రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇది సరైనదేనా? తగిన సూచనలు ఇవ్వండి.          - దమయంతి, హైదరాబాద్

 మీ కూతురి పెళ్లి కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మీ లక్ష్యమైతే, ఎండోమెంట్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. అయితే మీరు ఇప్పుడు ఈ పాలసీ నుంచి వైదొలగడం కూడా సరైన విధానం కాదు. ఒకసారి మీ పాలసీ డాక్యుమెంట్లను అధ్యయనం చేసి సరెండర్ చార్జీలను పరిశీలించండి. పదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్ కాలానికి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

 ఎస్‌బీఐ కాంట్రా, ఎస్‌బీఐ మ్యాగ్నమ్ ట్యాక్స్ గెయిన్‌లలో ఏడేళ్ల క్రితం ఒక ఏజెంట్ ద్వారా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. వాటిని ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. నేను పన్నులేమైనా చెల్లించాల్సి ఉంటుందా? వాటిని ఎలా ఉపసంహరించుకోవాలో కూడా వివరించండి?                                - లక్ష్మీ నాయక్, ఆదిలాబాద్
 మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏ రోజునైనా ఉపసంహరించుకోవచ్చు. రెండు రోజుల్లో మీ సొమ్ము మీ చేతికందుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ రెండు ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ కావడం, మీరు ఏడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయడం వంటి కారణాల వల్ల మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ ఫండ్స్‌లో ఏడాదికి  మించి ఇన్వెస్ట్ చేస్తే, క్యాపిటల్ గెయిన్స్‌పై ఎలాంటి పన్నులుండవు. రిడీమింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫామ్‌ను పూర్తి చేసి మీ అకౌంట్ ఉన్న ఎస్‌బీఐ బ్రాం చీలో ఆ ఫామ్‌ను ఇస్తే చాలు. మీరు రిడంప్షన్ ఫామ్‌ను మెయిల్ కూడా చేయవచ్చు.

 నేనొక రిటైరైన ప్రభుత్వ ఉద్యోగిని.  నా రిటైర్మెంట్ డబ్బులను సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లోనూ, బ్యాంక్ ఎఫ్‌డీల్లోనూ ఇన్వెస్ట్ చేశాను. వీటి నుంచి వచ్చే వడ్డీని - డీఎస్‌పీ బ్లాక్‌రాక్ టాప్ 100, యూటీఐ డివిడెండ్ ఈల్డ్, బిర్లా సన్‌లైఫ్ 95, యూటీఐ బ్యాలెన్స్‌డ్, హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్, రిలయన్స్ ఎంఐపీల్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఫండ్స్ అన్నింటికీ, ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండేది. ఇప్పుడు ఈ ఫండ్స్ రేటింగ్ తగ్గుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేనేం చేయాలి?          - అబూ ఖాన్, కరీంనగర్
 కొన్నేళ్ల క్రితం ఈ ఫండ్స్ పనితీరు బాగానే ఉండేది. కానీ ఇటీవల  వీటి పనితీరు ఈ కేటగిరిలోని ఇతర ఫండ్స్‌తో పోల్చితే ఏమంత బాగా లేదనే చెప్పాలి. మీరు మీ రిటైర్మెంట్ సొమ్ములపై వచ్చే వడ్డీలను ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. మీ పోర్ట్‌ఫోలియోను ట్రిమ్ చేయండి. 2-3 బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఫండ్స్ రాబడులే  బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ల్లో ఒడిదుడుకులు తక్కువ. కొంచెం స్థిరత్వం ఎక్కువ. ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్- కెనరా రొబెకో బ్యాలెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ అడ్వాండేజ్, టాటా బ్యాలెన్స్‌డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్‌లను పరిశీలించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement