రుమేనియాలో శనివారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది.
రుమేనియాలో శనివారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. రుమేనియాలో తూర్పు, మధ్య ప్రాంతాలతో పాటు సరిహద్దు దేశం మాల్డోవాలో భూప్రకంపనలు సంభవించాయి.
జనం భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా ఆరు బయటే గడిపారు. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ప్రకంపనలకు ఇళ్లల్లోని వస్తువులు కిందకు పడిపోయాయి. కొందరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.