కొచ్చి : తీసుకున్న విద్యా రుణం తిరిగి తీర్చకపోయినా... అది సిబిల్ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుందని క్రెడిట్ ఇన్‌ఫర్‌మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (సిబిల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్-కన్జూమర్ సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్స్ హర్షాలా చందోర్కర్ స్పష్టం చేశారు. విద్యారుణం తీసుకున్న ఒక వ్యక్తి తన కోర్సును పూర్తిచేసిన నిర్దిష్ట సమయం తర్వాత రుణ బకాయి చెల్లించాల్సి ఉంటుంది. లేదా సంబంధిత వ్యక్తికి హామీ ఉన్న వ్యక్తి అయినా నెలవారీ చెల్లింపులు జరపాలి.
పెరుగుతున్న విద్యా రుణ బకాయిలు... ఈ రుణాలకు సంబంధించి సిబిల్ స్కోర్ సమస్య ఉండదని కొందరు భావిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో చందోర్కర్ ఈ విషయం చెప్పారు. రుణ అప్లికేషన్ ప్రక్రియ పూర్తికి బ్యాంకులు సిబిల్ ట్రాన్స్ యూనియన్ స్కోర్‌ను ప్రమాణంగా తీసుకుంటాయి. విద్యా రుణానికి సంబంధించి ముఖ్యాంశాలు చూస్తే..
సిబిల్ డేటా ప్రకారం దేశంలో, విదేశాల్లో విద్యకు సంబంధించి మొత్తం రుణాల విలువ 2015 మార్చి 31 నాటికి రూ.63,800 కోట్ల మూడు, నాలుగు త్రైమాసికాల్లో విద్యా రుణాలకు అత్యధికంగా దరఖాస్తులు దాఖలవుతున్నాయి. 2014 నాల్గవ త్రైమాసికంలో 1,30,000 విద్యా రుణ దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రస్తుతం సగటు రుణం రూ.6 లక్షలకు చేరింది.మొత్తం మంజూరులో రూ.1 లక్ష లోపు రుణాలు 10 శాతంకన్నా తక్కువ ఉండగా... రూ.5 లక్షలు దాటిన రుణాల సంఖ్య 30 శాతంపైనే.
విద్యా రుణం తీర్చకపోయినా.. మైనస్ స్కోర్: సిబిల్
Published Fri, Jun 5 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
Advertisement