సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన అభ్యర్థులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ‘మీడియా సర్కార్’ వెబ్‌సైట్ విడుదల చేసిన సీడీల వ్యవహారంపై ఎన్నికల సంఘం దర్యాప్తు ప్రారంభించింది. ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, యోగిందర్ యాదవ్‌లు శనివారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్‌ను కలిశారు. తమపై ఆరోపణలకు కారణమైన సీడీల పంపిణీని వెంటనే నిలిపివేయాలని కోరారు. సీడీల పంపకం ఎన్నికల నియామావళి ఉల్లంఘన కిందకు వస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.