నా పెళ్లిలో ఈ నగలు బాగుంటాయి కానీ: హీరోయిన్‌ | Esah gupta talks about her marriage | Sakshi
Sakshi News home page

నా పెళ్లిలో ఈ నగలు బాగుంటాయి కానీ: హీరోయిన్‌

Published Sun, Aug 28 2016 6:37 PM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM

నా పెళ్లిలో ఈ నగలు బాగుంటాయి కానీ: హీరోయిన్‌ - Sakshi

నా పెళ్లిలో ఈ నగలు బాగుంటాయి కానీ: హీరోయిన్‌

'నేను పెళ్లిచేసుకుంటే ఈ బంగారు అభరణాలు ధరించాలని కోరుకుంటాను.. కానీ నిజానికైతే నాకిప్పుడు పెళ్లి ఆలోచనలేదు. రిలేషన్‌షిప్‌ గోల్స్‌ నేను నమ్మను' అంటూ ట్విస్టు ఇచ్చింది బాలీవుడ్ భామ ఇషా గుప్తా. తాజాగా 'రుస్తుం' సినిమాతో పలుకరించిన ఈ బ్యూటీ ప్రముఖ నగల దుకాణం 'హజూరి లాల్‌ బై సందీప్‌ నారంగ్‌'కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ సందర్భంగా పెళ్లి అభరణాలు ధరించి మురిసిపోయిన ఈ అమ్మడు 'నీ పెళ్లి ఎప్పుడు' అంటే మాత్రం ఒకింత చిత్రమైన సమాధానమిచ్చింది.

'హాహా.. ఇప్పుడు పెళ్లి లేదూ. ఆ ముచ్చట లేదు. అసలు అనుబంధాల లక్ష్యాలను పెద్దగా విశ్వసించను. జస్ట్‌ కెరీర్‌ మీదనే ఇప్పుడు ఫోకస్‌ చేశాను' అని ఇషా గుప్తా బదులిచ్చింది. 'జన్నత్ 2' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఇషా .. ఆ తర్వాత 'రాజ్‌ 3డీ', 'హమ్‌షకల్‌', 'చక్రవ్యూహ్' వంటి సినిమాల్లో నటించింది. తాజాగా 'రుస్తుం'తో ప్రశంసలందుకున్న బ్యూటీ త్వరలో 'కమాండో 2', 'బాద్షాహో' చిత్రాలతో రానుంది. ఈ క్రమంలో పెళ్లి గురించి తాను అస్సలు ఆలోచించడం లేదని, ప్రస్తుతం తాను విభిన్నమైన పాత్రలు పోషిస్తుండటంతో కెరీర్‌ సంతృప్తిగా సాగుతోందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement