'భోపాల్' దుర్ఘటన ప్రధాన నిందితుడు మృతి
న్యూయార్క్: యూనియన్ కార్బైడ్ మాజీ చీఫ్, 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులోప్రధాని నిందితుడు వారెన్ ఆండర్సన్(92) మృతి చెందారు. ఫ్లోరిడాలోని వెరో బీచ్ లో ఓ ఆస్పత్రిలో సెప్టెంబర్ 29న ఆయన మరణించారు. వారెన్ ఆండర్సన్ మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించనప్పటికీ, ప్రభుత్వ రికార్డుల ద్వారా ఆయన మరణవార్త వెలుగులోకి వచ్చిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
1984లో భోపాల్ లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుంచి గ్యాస్ లీకయి 3 వేల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది రుగ్మతల బారిన పడ్డారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత భోపాల్ వచ్చిన వారెన్ ఆండర్సన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన అమెరికా పారిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం భారత్ వెదుకుతూనే ఉంది.