భోపాల్: భోపాల్ గ్యాస్ ఘోరకలి జరిగి మూడు దశాబ్దాలు గడిచినా మృతుల సంఖ్యపై ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కలు లేవని ఓ స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. విషతుల్యమైన వ్యర్థాలను ప్రమాదం జరిగిన యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో వదిలివేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
అనధికార లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 25 వేలు దాటింది. అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 5295 మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతోంది. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేశామని తెలిపింది.
తమకున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 25 వేలు దాటిందని, వీరందరి కుటుంబాలకు పరిహారం అందించాలని భోపాల్ గ్రూప్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్షన్స్(బీజీఐఏ) కార్యకర్త రచనా ధింగ్రా డిమాండ్ చేశారు. బాధిత 15342 కుటుంబాలకు పరిహారం కింద రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని కేంద్రాన్ని 2012లో మధ్యప్రదేశ్ మంత్రులు డిమాండ్ చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.
'భోపాల్' మృతుల సంఖ్యపై కొరవడ్డ కచ్చితత్వం
Published Wed, Dec 3 2014 1:07 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement
Advertisement