ఏటీఎం సేవలు ఉచితంగానే ఉండాలి: రాజీవ్ ఠక్రూ | Finance ministry against bank’s charging their customers for ATM service | Sakshi
Sakshi News home page

ఏటీఎం సేవలు ఉచితంగానే ఉండాలి: రాజీవ్ ఠక్రూ

Published Fri, Jan 24 2014 1:42 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

Finance ministry against bank’s charging their customers for ATM service

ముంబై: ఏటీఎం సేవలను ఇప్పుడున్న మాదిరిగా ఉచితంగానే అందించాలని, ఒకవేళ ఏటీఎం సర్వీసులపై ఫీజు వసూలు చేస్తే ఖాతాదారులు బ్యాంకు బ్రాంచీలకు ఎగబడతారని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి (ఫైనాన్షియల్ సర్వీసెస్) రాజీవ్ ఠక్రూ చెప్పారు. అదే జరిగితే ఏటీఎంల నిర్వహణ కంటే అది మరింత భారమవుతుందని తెలియజేశారు. బ్యాంకింగ్ టెక్నాలజీపై ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏటీఎం సేవలపై ఫీజు వసూలుకు ప్రభుత్వ అనుమతిని ఇప్పటివరకూ ఏ బ్యాంకూ కోరలేదని తెలియజేశారు. ఈ విషయంలో రిజర్వు బ్యాంకు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ‘‘ఏటీఎం సేవల కంటే బ్యాంకులో టెల్లర్ సర్వీసు నిర్వహణే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఏటీఎంలలో 24 గంటలూ భద్రతా ఏర్పాట్లు ఉండాలంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు జారీచేసిన ఉత్తర్వులపై పునరాలోచన అవసరం’’ అన్నారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement