ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. భేజి పోలీసు స్టేషన్ పరిధిలోని బోధ్రాజ్పూర్ గ్రామ సమీపంలో ఉన్న అడవుల్లో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సుక్మా జిల్లా అదనపు ఎస్పీ నీరజ్ చంద్రకర్ తెలిపారు. సీఆర్పీఎఫ్తో పాటు మావోయిస్టుల అణచివేతకు ప్రత్యేకంగా ఏర్పాటైన కోబ్రా దళం, జిల్లా పోలీసులు కలిసి సంయుక్తంగా ఈ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొంటున్నారు.
ఇది రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బలగాలు కూంబింగ్ చేస్తున్న విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో పాటు భద్రతాదళాలపై కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే భద్రతాదళాలు కూడా తిరిగి కాల్పులు జరపడంతో మావోయిస్టులు వెనుదిరిగారు. గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించేందుకు హెలికాప్టర్లను పంపారు.
మందుపాతర పేలి ఐదుగురు జవాన్లకు గాయాలు
Published Sun, Feb 9 2014 3:09 PM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM
Advertisement
Advertisement