మావోయిస్టుల మెరుపుదాడి: 13 మంది జవాన్ల మృతి | 13 crpf jawans killed in maoist ambush in chhattisgarh | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల మెరుపుదాడి: 13 మంది జవాన్ల మృతి

Published Mon, Dec 1 2014 5:57 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

13 crpf jawans killed in maoist ambush in chhattisgarh

సుకుమా: చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల మరోసారి మారణహోమం సృష్టించారు. సుకుమా జిల్లా చింతగుపా సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని సోమవారం మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో 13 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

మృతుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఉన్నట్టు సమాచారం. స్థానికులను రక్షణగా వాడుకుని మావోయిస్టులు ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. రేపటి నుంచి పీఎల్ జీఏ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. మావోయిస్టుల దాడితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement