కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ టక్కర్ ప్రావెన్స్లోని ఖ్వాజాగఢ్ జిల్లా స్థానిక మార్కెట్ వద్ద మంగళవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో అయిదుగు అక్కడికక్కడే మరణించారు. మరో 21 మంది గాయపడ్డారని ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు తెలిపారు. మార్కెట్లో జనం అత్యంత రద్దీగా ఉన్న సమయంలో ఆ బాంబు పేలుడు సంభవించిందని చెప్పారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ బాంబు పేలుడుకు తామే బాధ్యులమని ఇంతవరకు ఎవరు ప్రకటించ లేదన్నారు. అయితే ఇది తాలిబాన్ తీవ్రవాదుల పనే అని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది మొదటి ఆరునెలలో ఆఫ్ఘానిస్థాన్లో జరిగిన హింస కారణంగా 1560 మంది మృత్యువాత పడగా, 3290 మంది గాయపడ్డారని కాబూల్లోని యూఎన్ మిషన్ వెల్లడించింది.