జమ్మూ కాశ్మీర్లోని గండర్బల్ జిల్లాలోని ప్రంగ్ సమీపంలోని నజవాన్ అటవీ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున కంగన్ పోలీసులు, 24వ రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన భద్రతదళాలు సంయుక్తంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు మరణించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ దళాలు గత రాత్రి నుంచి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా భద్రతదళాలకు తీవ్రవాదులు తారసపడ్డారు.
దాంతో తీవ్రవాదులు కాల్పుల ప్రారంభించగానే, భద్రతదళాలు అప్రమత్తమైయ్యాయి. దాంతో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో తీవ్రవాదులు మరణించారు. మృతి చెందిన తీవ్రవాదులు స్థానికులు కాదని భద్రత అధికారులు అభిప్రాయపడ్డారని తెలిపింది. తీవ్రవాదుల మృతదేహలను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు హోంశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. లష్కర్-ఈ- తొయిబా సంస్థకు చెందిన అసదుల్లా వర్గానికి చెందిన వారని వివరించింది.