విదేశీ విద్య..
మంచి భవిష్యత్తును వెతుక్కొనే క్రమంలో భారతీయ విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలకు వేలంవెర్రిగా ‘క్యూ’ కడుతున్నారు. నాణ్యమైన విద్య అందుతుందనే కంటే... ఆయా దేశాల్లో ఉద్యోగాలు వెతుక్కొని, అక్కడే స్థిరపడిపోవడానికి అక్కడి విద్యాసంస్థల్లో చేరడం మొదటి మెట్టుగా మనవాళ్లు పరిగణిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలు విదేశాల్లో చదువుకొంటున్నారని చెప్పుకోవడానికి... వెళ్లాల్సిందేనని ప్రోత్స హిస్తున్నారు. ఇదో స్టేటస్ సింబల్ అయింది. 2014లోనే విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది. ఈ విషయంలో చైనా ముందుంది. చైనా నుంచి ఏకంగా 6.5 లక్షల మంది వివిధదేశాల్లోని యూనివర్సిటీల్లో చదువుతున్నారు. విదేశీ యూనివర్సిటీలకు విద్యార్థులను అందించే దేశాల్లో భారత్‌ది రెండో స్థానం.
విదేశాలకు వెళ్లే ప్రతి ముగ్గురు భారతీయ విద్యార్థుల్లో ఒకరు తమ కలల సౌధంగా అమెరికానే ఎంచుకుంటున్నారు. బ్రిటన్‌లో వీసా నిబంధనలు కఠినంగా కావడంతో గత సంవత్సరంతో పోలిస్తే భారతీయ విద్యార్థుల సంఖ్య 10 శాతం పడిపోయింది. మరోవైపు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్... ఈ ఏడు ముఖ్యదేశాల నుంచి 2013లో భారత్‌కు 13,961 మంది విద్యార్థులు రాగా... 2014లో ఈ సంఖ్య దారుణంగా 3,737కు పడిపోయింది. అంటే 73 శాతం తగ్గుదల. అమెరికాలో గడిచిన నాలుగేళ్లుగా కొద్దిగా హెచ్చుతగ్గులున్నా... భారతీయ విద్యార్థుల సంఖ్య లక్ష దగ్గరే ఉంది. కానీ 2014-15లో మాత్రం ఏకంగా 29.4 శాతం పెరుగుదల నమోదైంది. అమెరి కాలో గత నాలుగేళ్లుగా పరిస్థితి, భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న మొద టి ఐదు దేశాలు... అంకెల్లో చూద్దాం.