![నాలుగు దాటితే మరీ మంచిది!](/styles/webp/s3/article_images/2017/09/3/81444238618_625x300.jpg.webp?itok=v4T5NeFd)
నాలుగు దాటితే మరీ మంచిది!
పరిపరి శోధన
కాఫీ తాగితే మూడ్స్ మెరుగుపడతాయని మాత్రమే చాలామందికి అనుభవపూర్వకంగా తెలుసు. కాఫీ అతిగా తాగితే నానా ఆరోగ్య సమస్యలు వస్తాయని, అందువల్ల మితంగా మాత్రమే కాఫీ సేవనం కావించాలని వైద్య నిపుణులు చేసే హెచ్చరికలూ మనకు తెలుసు. కాఫీగత ప్రాణులు మరేం దిగులు పడక్కర్లేదు. మూడ్ బాగా లేకపోయినా, తలనొప్పిగా ఉన్నా మొహమాటం లేకుండా కాఫీ లాగించేయవచ్చు. ఎందుకంటే, కాఫీ తాగితే కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఒక తాజా పరిశోధనలో తేలింది.
రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగే వారికి కేన్సర్ సోకే అవకాశాలు మిగిలిన వారితో పోలిస్తే 30 శాతం తక్కువగా ఉంటాయని ఇంగ్లండ్ పరిశోధకులు చెబుతున్నారు. కాఫీ సేవనంపై తమ పరిశోధన సారాంశాన్ని వారు ‘న్యూ ఇంగ్ల్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.