గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
* ప్రభుత్వ వైఫల్యాలేవీ గవర్నర్‌కు కనపడలేదా?
* 40 రోజులు అసెంబ్లీ జరపాలని కోరితే.. 16 రోజులు చాలంటారా?
* ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ తెలుగుదేశం ప్రభుత్వాన్ని పొగిడేందుకే సరిపోయిందని, వైఫల్యాల ప్రస్తావనే తేలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం అనంతరం ఆ పార్టీ ఎమ్యెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు.
టీడీపీ స్క్రిప్ట్ గవర్నర్ చదివినట్టుంది తప్ప మరొకటి లేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరముందని, అందుకే 40 రోజులుపాటు బడ్జెట్ సమావేశాలు జరపాలని అడిగితే ఇతర కార్యక్రమాలున్నాయంటూ 16 రోజులకు సరిపెట్టారని పేర్కొన్నారు. సీఆర్‌డీఏ భూ సమీకరణ, రైతాంగం అసంతృప్తి వంటి 25 అంశాలు ప్రస్తావించాలని తాము కోరిన ట్లు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
వీటన్నిటికీ ముఖ్యమంత్రి సమ్మతించారని, అయినా ఆయన ఏరోజూ మాటమీద నిలబడరు కాబట్టి వీటిపై చర్చ అనుమానంగా ఉందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పైన పేర్కొన్న సమస్యలన్నిటిపై చర్చించి, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద కార్యక్రమం ముగిసాక పరిపాలనలో ఘోరంగా వైఫల్యం చెందిన ప్రభుత్వంపైనా, స్పీకర్‌పైనా అవిశ్వాస తీర్మానం పెడతామని గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.
అసెంబ్లీలో చర్చ జరగాలని బీఏసీలో డిమాండ్ చేసిన అంశాలు
* సీఆర్‌డీఏ భూ సమీకరణ-రైతాంగ అసంతృప్తి-అవినీతి హా వ్యవసాయం- రుణమాఫీ వైఫల్యాలు, రైతాంగ సమస్యలు, గిట్టుబాటు ధరలు హా ప్రాజెక్టుల అంచనా పెంపులో అవినీతి * అగ్రిగోల్డ్ బాధితులు-ప్రభుత్వం తీసుకున్న చర్యలు
* కృష్ణా నదీ జలాలు-రైతాంగం ఇక్కట్లు-తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు
* వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి-సమస్యలు
* డ్వాక్రా రుణమాఫీ పేరుతో సంఘాల మనుగడ ప్రశ్నార్థకం * రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడి హా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం హా పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి
* నిరుద్యోగం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాలు, కాంట్రాక్టు ఉద్యోగాల తొలగింపు
* రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం * బలహీన వర్గాలకు పక్కా గృహాలు, కేంద్ర ప్రభుత్వ గృహ పథకాలు
* పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ
* స్థానిక సంస్థల నిర్వహణ, హక్కులు, బాధ్యతలు-రాజ్యాంగేతర కమిటీలు
* కరువు, వరదలు, రైతుల ఆత్మహత్యలు, వలసలు
* వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుట
* అడ్డగోలు భూ కేటాయింపులు
* విశ్వవిద్యాలయాలు-ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర ఖాళీలు, విద్యార్థుల సమస్యలు
* ప్రభుత్వ ఆస్పత్రుల ప్రయివేటీకరణ
* రాష్ట్రంలో ఇసుక కొరత-ఇసుక విధానంలో లోపాలు-జరిగిన అవకతవకలు
* రాజధాని తరలింపు-ఉద్యోగుల సమస్యలు
* ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నీరుగార్చుట
* అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తల సమస్యలు
టీడీపీ స్క్రిప్ట్ చదివినట్టుంది!
Published Sun, Mar 6 2016 5:03 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM
Advertisement
Advertisement