కన్యత్వాన్ని వేలానికి పెట్టిన అమ్మడు! | Girl to auction her virginity | Sakshi
Sakshi News home page

కన్యత్వాన్ని వేలానికి పెట్టిన అమ్మడు!

Published Sat, Mar 22 2014 2:02 PM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

కన్యత్వాన్ని వేలానికి పెట్టిన అమ్మడు!

కన్యత్వాన్ని వేలానికి పెట్టిన అమ్మడు!

ఎలిజబెత్ రెయిన్ అనే అమెరికన్ అమ్మడు తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. పాడుకున్న వాడికి పాడుకున్నంత అని ఓ వెబ్ సైట్ ద్వారా అనౌన్స్ చేసింది. అత్యధిక వేలం పాట పాడిన వారితో 12 గంటల డేటింగ్, ఆ తొలి అనుభవం దక్కుతాయట! ఈ ఆఫర్ తో డబ్బుల వాన కురుస్తుందని రెయిన్ భావిస్తోందట.


2009 లో ఇలాగే శీలాన్ని వేలం పెట్టి 3.7 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన నటాలీ డిలాన్ తనకు ఆదర్శం అని ఈ అమ్మాయి చెబుతోంది. తన వెబ్ సైట్ లో తన అందచందాల ట్రెయిలర్ ను అప్ లోడ్ చేసింది. అయితే తన ముఖాన్ని మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది. 'నా కన్యత్వానికి వెల ఉంది కానీ నా వ్యక్తిత్వం మాత్రం అమూల్యం' అని అమ్మడు వక్కాణించింది. తనను ఎవరైనా వ్యభిచారి లేదా వేశ్య అంటే పట్టించుకోనని. అదీ ఒక వృత్తేనని సాహసోపేతమైన వ్యాఖ్యలు చేసేసింది. రెయిన్ మెడికల్ విద్యార్ధి.


ఈ వేలానికి తేదీ ఏప్రిల్ 1 గా 27 ఏళ్ల రెయిన్ నిర్ణయించింది. అయితే రెయిన్ కురిసే మేఘమా, ఉత్తినే ఊరించే మేఘమా అన్నది ఏప్రిల్ 1 న తేలిపోతుంది. అన్నట్టు ఆ రోజు ఏప్రిల్ ఫూల్ రోజు కూడానండోయ్!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement