ప్రచార వాహనం ఢీకొని చిన్నారి మృతి | girl toddler run over by campaign vehicle | Sakshi
Sakshi News home page

ప్రచార వాహనం ఢీకొని చిన్నారి మృతి

Published Tue, Oct 20 2015 6:21 PM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

girl toddler run over by campaign vehicle

హాజీపూర్ : బిహార్లో ఎన్నికల ప్రచార వాహనం ఢీకొని రెండేళ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైశాలి జిల్లా రాజపాకర్లో తన తాత ఇంటిముందు చిన్నారి ఆడుకుంటోంది. ఇంతలో అటుగా వచ్చిన ఆర్జేడీ ప్రచార వాహనం ఆ పాపను ఢీకొని వెళ్లడంతో పాప అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఆ వాహనం రాజపాకర్ అసెంబ్లీ నియోజకవర్గ ఆర్జేడీ అభ్యర్థి శివ చంద్రరామ్కు చెందినది. ఆ వాహనంలో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రచార సామగ్రిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement