campaign vehicle
-
మా పైసలేవీ?.. ప్రచార రథం అడ్డగింత
సాక్షి, ఖమ్మం: మధిర నియోజకవర్గ పరిధిలో ఇవాళ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అధికార బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాన్ని కొందరు అడ్డుకున్నారు. ప్రచారానికి పిలిచి తమకు డబ్బులు ఇవ్వలేదని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వాహనాన్ని తగలబెడతామని హెచ్చరించడం స్వల్ఫ ఉద్రిక్తతలకు దారి తీసింది. మధిర నుంచి బీఆర్ఎస్ తరఫున జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ పోటీ చేస్తున్నారు. ఇవాళ చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారాయన. ఆ ప్రచారంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది పాల్గొన్నారు. ఎండలో బీఆర్ఎస్, కమల్‌రాజ్ అనుకూల నినాదాలతో ఊరంతా కలియతిరిగారు. ఆఖర్లో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్లు. సర్పంచ్, జెడ్పీటీసీలే డబ్బులు పంచుకున్నారని.. తమకు పైసలు ఇవ్వకుండా గ్రామంలో వాహనం తిరిగితే తగలబెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో స్వల్ఫ ఉద్రిక్తత చోటు చేసుకోగా.. స్థానికులు వాళ్లను సముదాయించడంతో ప్రచార రథం అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
డప్పు, చర్మకారులు రూపొందించిన ప్రచార రథాన్ని ప్రారంభించిన సజ్జల
-
ప్రచార వాహనం ఢీకొని చిన్నారి మృతి
హాజీపూర్ : బిహార్‌లో ఎన్నికల ప్రచార వాహనం ఢీకొని రెండేళ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైశాలి జిల్లా రాజపాకర్లో తన తాత ఇంటిముందు చిన్నారి ఆడుకుంటోంది. ఇంతలో అటుగా వచ్చిన ఆర్జేడీ ప్రచార వాహనం ఆ పాపను ఢీకొని వెళ్లడంతో పాప అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ వాహనం రాజపాకర్ అసెంబ్లీ నియోజకవర్గ ఆర్జేడీ అభ్యర్థి శివ చంద్రరామ్కు చెందినది. ఆ వాహనంలో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రచార సామగ్రిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.