గో టు పాకిస్థాన్ షుడ్ గో టు హెల్!
న్యూఢిల్లీ: కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రకటనలు కూడా సామెతలుగా మారిపోతాయి. అందులో ఒకటి ‘గో టు పాకిస్థాన్’. ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తన భార్య భారత్ లో పెరుగుతున్న అభద్రతా భావం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోందని అన్నందుకు కొన్ని శక్తులు ‘గో టు పాకిస్థాన్’ అని వ్యాఖ్యానించాయి. బీఫ్ లేకుండా బతకలేమన్నందుకు ‘గో టు పాకిస్థాన్’ అన్నారు.
బిహార్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీని సమర్థించని వాళ్లు ‘గో టు పాకిస్థాన్’ అని ఓ పార్టీ వారు హెచ్చరించారు. బిహార్‌లో బీజేపీ ఓడితే పాకిస్థాన్ లో టపాసులు పేలుస్తారని కూడా అన్నారు. ‘సే వందేమాతరం ఆర్ గో టు పాకిస్థాన్’ నినాదాలు వచ్చాయి. బాంద్రా పోలీసులు షాయిక్ సోదరులను చితక్కొట్టి ‘గో టు పాకిస్థాన్’ అన్నారు.
భారత్‌లో నివసిస్తున్నారుగానీ వారి ఆత్మ మాత్రం పాకిస్థాన్ లోనే ఉందని మరి కొందర వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆత్మ అంటే వారి ఉద్దేశం సోల్ అని కాదు. దెయ్యం అనే అర్థంలో కొందర వాడుతున్నారు. వాస్తవానికి ‘గో టు పాకిస్థాన్’ అనే పదం చివరకు ‘గో టు హెల్’ అనే సామెతకు ప్రత్యామ్నాయంగా మారిపోయింది. పలు టీవీ చర్చల్లో ఈ ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. చరిత్రలోకి వెళితే ‘గో టు పాకిస్థాన్’ అనే నినాదం దేశం విభజన నాటి నుంచి ఉంది. ‘గో టు పాకిస్థాన్ షుడ్ గో టు హెల్’.
-ఓ సెక్యులరిస్ట్ కామెంట్