Go to Pakistan
-
పాకిస్తాన్‌కు వెళ్లిపోండి!
గురుగ్రామ్: హోలీ పండుగ రోజున హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ ముస్లిం కుటుంబంపై దాదాపు 25 మంది దుండగులు దాడి చేసి ‘మీరంతా పాకిస్తాన్ వెళ్లిపొండి’ అని బెదిరించారు. పోలీసులు ఇప్పటివరకూ దాడికి పాల్పడ్డ నిందితులందరినీ అరెస్ట్ చేయకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. యూపీలోని భాగ్‌పట్ జిల్లాకు చెందిన సాజిద్ తన కుటుంబ సభ్యులతో కలిసి హరియాణాలోని ధుమస్‌పూర్ గ్రామంలో సొంతిల్లు కట్టుకని ఉంటున్నారు. గురువారం హోలీ రోజున సాజిద్, అతని చుట్టాల పిల్లలు ఇంటి దగ్గర్లో ఆడుకుంటున్నారు. అక్కడకు బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు..‘ఏయ్.. ఇక్కడ మీరేం చేస్తున్నారు? పాక్‌కు వెళ్లి క్రికెట్ ఆడుకోండి’ అని అవమానించారు. దీన్ని గమనించిన సాజిద్ అక్కడకు వెళ్లి ఇద్దరు యువకులను నిలదీయడంతో ఆయనపై దాడిచేశారు. తర్వాత కర్రలు, కత్తులు, రాడ్లతో చేరుకున్న 20–25 మంది సాజిద్ ఇంట్లోకి దూసుకొచ్చి దాడిచేశారు. చివరకు ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనను పలు రాజకీయపార్టీలు ఖండించాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ మహేశ్ కుమార్(24) నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ దినేశ్ శర్మ తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన దుండగుల్ని ఆదివారంలోగా అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయిస్తామని ముస్లిమ్ ఏక్తా మంచ్ హెచ్చరించింది. -
పాకిస్తాన్‌కు పో...!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ ముస్లిం సీనియర్ సిటిజన్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. కొందరు యువకులు వద్దనికి సీటు ఇవ్వడానికి నిరాకరించడమేకాక అతనిని పాకిస్తానీ అంటూ దుర్భాషలాడారు. ఈ ఘటన ఢిల్లీ మెట్రో యెల్లో లైన్లో జరిగింది. సీనియర్ సిటిజన్ సీట్లో కూర్చున్న ఇద్దరు యువకులు ముస్లిం వృద్ధునికి సీటు ఇవ్వడానికి నిరాకరించారు. రైల్లో రద్దీ అధికంగా ఉండడంతో ఆయన వారిని లేచి సీటివ్వమని కోరారు. కానీ వారు సీటు ఖాళీ చేయడానికి నిరాకరించడమేకాక రైల్ కోచ్‌లో సీటు కావాలంటే పాకిస్తాన్‌కు వెళ్లిపో అంటూ అపహాస్యం చేశారు. ఫేస్బుక్ పోస్టుతో వెలుగులోకి... మహిళా హక్కుల కార్యకర్త కవితా కృష్ణమూర్తి ఈ విషయాన్ని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఏఐసీసీఈయూ జాతీయ కార్యదర్శి సంతోష్ రాయ్ కొన్ని రోజుల కిందట యెల్లో లైన్ మెట్రోలో ప్రయాణిస్తుం డగా ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. రాయ్ ఎదురుగా సీనియర్ సిటిజన్ల సీట్లలో ఇద్దరు యువకులు కూర్చుని ఉన్నారని, ఓ వృద్ధుడు వారిని సీటు ఇవ్వవలసిందిగా అడిగినప్పుడు వారు అందుకు నిరాకరించా రని ఆమె తెలిపారు. ఆయన మరోసారి వారిని సీటు నుంచి లేవమని కోరినప్పుడు ఈ సీటు హిందుస్తానీల కోసమని, నీ వంటి పాకిస్తానీల కోసం కాదని అపహాస్యం చేశారు. అది చూసిన రాయ్ వెంటనే జోక్యం చేసుకుని సీనియర్ ïసిటిజన్‌కు క్షమాపణ చెప్పవలసిందిగా యువకులను డిమాండ్ చేశారు. కానీ మరి కొందరు యువకులు ఇద్దరు యువకులకు అండగా వచ్చి రాయ్ కాలర్ పట్టుకుని పాకిస్తాన్ వెళ్లిపో అంటూ అవమానించారు. దీంతో కొందరు మెట్రో ప్రయాణీకులు రాయ్‌కు మద్దతుగా వచ్చారు. మెట్రో రైలు ఖాన్ మార్కెట్ స్టేషన్లో ఆగినప్పుడు ఓ గార్డు కంపార్ట్ మెంట్లోకి వచ్చాడు. అతను రాయ్‌తో పాటు ముస్లిం సీనియర్ సిటిజన్‌ను, ఇద్దరు యువకులను పండారా రోడ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల తరువాత రాయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు సీనియర్ సిటిజన్ యువకులను క్షమించి వదిలేశాడని పోలీసులు చెప్పారు. కుర్రచేష్టగా పరిగణించి యువకుల క్షమాపణను స్వీకరిస్తున్నట్లు సీనియర్ సిటిజన్ రాసిచ్చిన లేఖను పోలీసులు రాయ్‌కు చూపారు. ఆ తర్వాత యువకులు రాయ్‌కు కూడా క్షమాపణలు తెలిపారు. -
గో టు పాకిస్థాన్ షుడ్ గో టు హెల్!
న్యూఢిల్లీ: కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రకటనలు కూడా సామెతలుగా మారిపోతాయి. అందులో ఒకటి ‘గో టు పాకిస్థాన్’. ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తన భార్య భారత్ లో పెరుగుతున్న అభద్రతా భావం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోందని అన్నందుకు కొన్ని శక్తులు ‘గో టు పాకిస్థాన్’ అని వ్యాఖ్యానించాయి. బీఫ్ లేకుండా బతకలేమన్నందుకు ‘గో టు పాకిస్థాన్’ అన్నారు. బిహార్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీని సమర్థించని వాళ్లు ‘గో టు పాకిస్థాన్’ అని ఓ పార్టీ వారు హెచ్చరించారు. బిహార్‌లో బీజేపీ ఓడితే పాకిస్థాన్ లో టపాసులు పేలుస్తారని కూడా అన్నారు. ‘సే వందేమాతరం ఆర్ గో టు పాకిస్థాన్’ నినాదాలు వచ్చాయి. బాంద్రా పోలీసులు షాయిక్ సోదరులను చితక్కొట్టి ‘గో టు పాకిస్థాన్’ అన్నారు. భారత్‌లో నివసిస్తున్నారుగానీ వారి ఆత్మ మాత్రం పాకిస్థాన్ లోనే ఉందని మరి కొందర వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆత్మ అంటే వారి ఉద్దేశం సోల్ అని కాదు. దెయ్యం అనే అర్థంలో కొందర వాడుతున్నారు. వాస్తవానికి ‘గో టు పాకిస్థాన్’ అనే పదం చివరకు ‘గో టు హెల్’ అనే సామెతకు ప్రత్యామ్నాయంగా మారిపోయింది. పలు టీవీ చర్చల్లో ఈ ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. చరిత్రలోకి వెళితే ‘గో టు పాకిస్థాన్’ అనే నినాదం దేశం విభజన నాటి నుంచి ఉంది. ‘గో టు పాకిస్థాన్ షుడ్ గో టు హెల్’. -ఓ సెక్యులరిస్ట్ కామెంట్