భారీగా పడిన బంగారం, వెండి
న్యూయార్క్/ముంబై: బంగారం, వెండి అంతర్జాతీయంగా తీవ్ర బలహీన ధోరణితో కదులుతున్నాయి. శుక్రవారం కడపటి సమాచారం అందే సరికి న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ కమోడిటీ డివిజన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర మూడు నెలల కనిష్ట స్థాయిలో 1,267 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గురువారం ట్రేడింగ్ ముగింపుతో పోల్చితే ఇది 29 డాలర్లకు (2 శాతం) పైగా నష్టం. ఇక వెండి కూడా 3 శాతం నష్టంతో 21 డాలర్ల వద్ద కదలాడుతోంది.
దేశీయంగా...: దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. ఇక్కడ పసిడి 10 గ్రాముల ధర 1.58 శాతం నష్టంతో(రూ.456) రూ. 28,401 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర 3 శాతం వరకూ నష్టంతో(రూ.1,340) రూ.46,925 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఇదే బలహీన ధోరణిలో కొనసాగి, ముగిస్తే శనివారం దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా అమెరికా ‘షట్‌డౌన్’ బంగారం ధరపై ప్రభావం చూపిస్తుండగా, దేశీయంగా అధిక ధరలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఈ మెటల్స్‌పై ప్రతికూలత కు కారణం.