గూగుల్ తల్లికి ఈ రోజు వెరీ స్పెషల్ | Google Doodle celebrates companys 18th birthday | Sakshi
Sakshi News home page

గూగుల్ తల్లికి ఈ రోజు వెరీ స్పెషల్

Published Tue, Sep 27 2016 9:22 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

గూగుల్ తల్లికి ఈ రోజు వెరీ స్పెషల్

గూగుల్ తల్లికి ఈ రోజు వెరీ స్పెషల్

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్కు సెప్టెంబర్ 27వ తేదీ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు గూగుల్ కంపెనీ 18వ బర్త్ డే. ఈ సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రత్యేక డ్యూడుల్ దర్శనమిచ్చింది. గాల్లో బెలూన్లు వేలాడుతున్నట్టుగా.. జీ ఫర్ గూగుల్ అనే అక్షరాలతో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నట్టు డ్యూడుల్ను రూపొందించారు.

1998 సెప్టెంబర్లో లారీ పేజ్, సెర్జీ బ్రిన్.. గూగుల్ను స్థాపించారు. కాగా కంపెనీని ఏ తేదీన స్థాపించారన్న విషయంపై స్పష్టత లేదు. పేజ్, బ్రిన్ సహా ఎవరూ వ్యవస్థాపక దినాన్ని గుర్తుపెట్టుకోలేదు. దీంతో గూగుల్ కంపెనీ ఆరు వేర్వేరు తేదీల్లో బర్త్ డే జరుపుకొంది. మొదట్లో సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8న బర్త్ డే చేసుకున్నారు. గూగుల్ హిస్టరీ లిస్ట్లో వ్యవస్థాపకం దినం సెప్టెంబర్ 4 అని ఉంది. 2006 నుంచి మాత్రం సెప్టెంబర్ 27వ తేదీన బర్త్ డే నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement