దేశీ గ్యాస్ ధర రెట్టింపు... | Govt notifies new gas pricing guidelines | Sakshi
Sakshi News home page

దేశీ గ్యాస్ ధర రెట్టింపు...

Published Sat, Jan 11 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

Govt notifies new gas pricing guidelines

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రెట్టింపు కానుంది. ఈ మేరకు కొత్త గ్యాస్ ధరల విధానాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫై చేసింది. దీంతో ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ ధర 8.2-8.4 డాలర్లకు ఎగబాకనుంది. కోల్‌బెడ్ మీథేన్(సీబీఎం), షేల్ గ్యాస్ సహా ఇతరత్రా అన్నిరకాల సంప్రదాయ గ్యాస్‌లకు కూడా ఏప్రిల్ 1 నుంచి ‘దేశీ సహజవాయు ధరల మార్గదర్శకాలు-2014’ వర్తిస్తాయని చమురు శాఖ పేర్కొంది. అంతర్జాతీయ ప్రామాణిక గ్యాస్ రేట్లు, దేశంలోకి దిగుమతయ్యే ద్రవీకృత సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ)ల సగటు ధరల ఆధారంగా దేశీ గ్యాస్ రేటును నిర్ణయించనున్నట్లు తెలిపింది. 2019 మార్చి 31 వరకూ ఐదేళ్లపాటు ఈ కొత్త విధానం అమలు కానుంది. ప్రతి మూడు నెలలకూ గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయి.
 
 రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేటు కంపెనీలతో పాటు ఓఎన్‌జీసీ తదితర ప్రభుత్వ రంగ కంపెనీలకూ ఈ కొత్త ధరల విధానం వర్తిస్తుంది. కాగా, రిలయన్స్ కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ1, డీ3 క్షేత్రాల్లో   గ్యాస్‌కు కొత్త ధర అమలవ్వాలంటే బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలన్న షరతును కేంద్రం విధించడం తెలిసిందే. రిలయన్స్ కావాలనే గ్యాస్‌ను వెలికితీయకుండా ధర పెరిగాక ఉత్పత్తి పెంచాలనుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ షరతు పెట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement